ఉరవకొండ::
దర్గా హోన్నూరు నుండి ఉరవకొండ పట్టణానికి విద్యాభ్యాసం చేయడానికి విద్యార్థులు రాకపోకలకు బస్సు సౌకర్యం కోరుతూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఏపీఎస్ఆర్టీసీ ఉరవకొండ డిపో మేనేజర్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ కోశాధికారి రాజు మాట్లాడుతూ దర్గా హోన్నూరు, గోవిందవాడ, కలవెల్లి తిప్ప, పాల్తూరు తదితర గ్రామాల నుండి విద్యార్థులు విద్యాభ్యాస కోసం ఉరవకొండ పట్టణానికి వస్తుండటంతో బస్సు సౌకర్యం సరిగ్గా లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. విద్యార్థులు వెళ్లే బస్సులో అదే ప్రాంతానికి చెందిన ప్రజలు కూడా ప్రయాణిస్తుండడంతో విద్యార్థులకు కనీసం నిలబడి ప్రయాణించడానికి కూడా వీలు లేకుండా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి తగ్గుపర్తి చందు నిన్నటి రోజున ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు గారి దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించి ఉరవకొండ డిపో మేనేజర్ గారికి వారం రోజులలోపు ఉరవకొండ నుంచి దర్గా హాన్నూరు కి విద్యార్థులకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది.కావున డిపో మేనేజర్ స్పందించి విద్యార్థులకు ప్రత్యేక బస్సు ఏర్పాటుచేసి పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాట వేయవలసిందిగా ఏఐఎస్ఎఫ్ నాయకులు కోరారు . ఈ కార్యక్రమంలో నాయకులు లాలుస్వామి, రఘు, మన్సూర్ వలి, సిద్ధిక్ తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment