బెంగుళూరు:బెంగుళూరు సెంట్రల్ జైలులో మళ్లీ వివాదాస్పద వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇటీవల ఐసిస్ రిక్రూటర్‌కి జైలులో VIP సౌకర్యాలు కల్పిస్తున్న వీడియో లీక్ అయి చర్చనీయాంశమవగా, ఇప్పుడు మరో వీడియో బయటకు రావడం సంచలనం రేపుతోంది.
తాజాగా లీకైన వీడియోలో కొంతమంది ఖైదీలు జైల్లోనే మద్యం సేవిస్తూ, పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ పార్టీ చేసుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జైల్లో ఇంత సౌకర్యం ఎలా లభిస్తుందో అన్న ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి.
అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించగా, వీడియోలో కనిపించిన ఖైదీల వివరాలు సేకరిస్తున్నారు.
