ఉరవకొండ నవంబర్ 6:అనంత
పురం జిల్లా లోని అన్ని మండలాలనుతక్షణమే కరవు మండలాలు గా ప్రకటించాలని జిల్లా ఐటి విభాగం వైసిపీ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వై.రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించకపోవడం విచారకరం అన్నారు.ఇలానే రాయలసీమ పై వివక్ష చూపితే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తాం అన్నారు.
అనంతపురం జిల్లాలో ఇప్పటికే పంటలు పండక రైతులు కుదేలయ్యారన్నారు.సరైన వర్షాలు లేక పంటలు ఇంతవరకు వెయ్యలేదు ఆరా కోరా పదునులో వేసిన పంటలు మొలకెత్తక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన హామీ మేరకు ఒకేసారి ఇరవైవేల రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకోవాలన్నారు.ఈసంవత్సరం కూడా పంటలు వేయాలన్నా రైతులతో రూపాయి లేదు కనీసం ఎకరాలు పదివేలు పంట సహాయం చేయాలన్నారు.ఒక్క పంటకు గిట్టుబాటుధర లేదు పండ్ల కాయగూరల తోటల రైతులురెట్లు లేక తీవ్ర నష్టాల పాలవుతున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం రైతులను ఆదుకోవాలన్నారు.కొన్ని మండలాల్లో అధిక వర్షపాతం కొన్ని మండలాల్లో అల్ప వర్షపాతం నమోదయ్యింది రైతులను అందుకుంటే మనుగడ సాగిస్తారు లేకుంటే వ్యవసాయం చేయడం కష్టతరం అవుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ప్రచార కమిటీ మండల అధ్యక్షుడు దేవేంద్ర సోషియల్ మీడియా మండల అధ్యక్షుడు గాదిలింగ ఉపాధ్యక్షుడు అనుష్ రెడ్డి నాయకులు సుభాష్ రెడ్డి ఖాజా తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment