అమరావతి : మన రాజ్యాoగం నాలుగు స్తంబాలపై నిలబడి ఉంది. ప్రతి పౌరుణ్ణి దృష్టిలో పెట్టుకొని డాక్టర్ అంబేద్కర్ రచించారని సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తి ఉద్ఘాటించారు . 75 ఏళ్ల భారత రాజ్యాంగ సదస్సులో CJI జస్టిస్ బీఆర్ గవాయ్ అదిరి పోయింది.
CJIగా ఇది ఆయన చివరి కార్యక్రమం.. నా స్వస్థలం మహారాష్ట్రలోని అమరావతి.. CJIగా నా చివరి కార్యక్రమం కూడా అమరావతిలోనే కావడం విశేషం.ఈ సందర్బంగా ఆయన మాట్లాడు తూమరో రెండు రోజుల్లో పదవీ విరమణ చేయబోతున్నాను.. సాంఘిక, ఆర్థిక న్యాయ సాధన కోసం రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను పొందుపరిచారు.ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే కోర్టులను ఆశ్రయించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది.. రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభకు అప్పగిస్తూ.. అంబేద్కర్ చేసిన ప్రసంగం ప్రతి న్యాయవాదికి కంఠోపాఠం కావాలి.అOబేద్కర్ రాజ్యాంగాన్ని ఓ స్థిర పత్రంగా భావించలేదు.. కాలానుగుణంగా మార్పులు అవసరమనే భావించారు.
కొన్ని అంశాల్లో రాజ్యాంగ సవరణ సులభం.. కొన్ని అంశాల్లో అది చాలా కఠినం.రాజ్యాంగం అమల్లోకి వచ్చిన మరుసటి ఏడాదే.. మొదటి రాజ్యాంగ సవరణ చేసుకున్నాం.. రిజర్వేషన్ల అంశంపై రాజ్యాంగానికి మొదటి సవరణ చేసుకున్నాం.రాజ్యాంగ సవరణ అంశంపై కేంద్రానికి, సుప్రీంకోర్టుకు మొదట్లో కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడింది.. కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే భావనను తీసుకొచ్చింది.
రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సవరించరాదని సుప్రీంకోర్టు చెప్పింది.. 1975 వరకూ ఆదేశిక సూత్రాల కంటే ప్రాథమిక హక్కులకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేది.*
కేశవానంద భారతి కేసు తర్వాత ప్రాథమిక హక్కులతో పాటు.. ఆదేశిక సూత్రాలకూ సమ ప్రాధాన్యం దక్కింది.
*మన రాజ్యాంగం నాలుగు స్థంభాలపై నిలబడి ఉంది.. ప్రతీ పౌరుడినీ దృష్టిలో పెట్టుకుని అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారు : సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్*

Comments
Post a Comment