75 ఏళ్ల భారత రాజ్యాంగ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పీచ్ హైలైట్స్..!
ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడు తూ మన రాజ్యాంగం కాల పరీక్షకు నిలిచింది.. చాయ్ వాలా దేశానికి ప్రధాని అయ్యారంటే అది రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛఅని అన్నారు.అంబేద్కర్ అత్యున్నతమైన రాజ్యాంగం ఇచ్చారు.. ఆర్థిక సంస్కరణలు దేశ దిశనే మార్చేశాయి.దేశంలోని ప్రతి ఒక్కరికీ ఎలాంటి తారతమ్యం లేకుండా అంబేడ్కర్ ఓటు హక్కు ఇచ్చారు.. చాలా గొప్పవని భావించిన దేశాల్లో కూడా మొదట్లో మహిళలకు ఓటుహక్కు లేదు.దేశంలో ఎన్నో పాలసీలు చూశాను.. 2014లో 11వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్, ప్రస్తుతం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది.
వచ్చే ఏడాది భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాబోతోంది.. 2038 నాటికి భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాబోతోంది2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్నది లక్ష్యం.ప్రజాస్వామ్యం దారి తప్పినప్పుడు న్యాయవ్యవస్థే దాన్ని గాడిన పెడుతుంది.. మీడియా రంగంలోనూ ఇటీవల చాలా మార్పులు వచ్చాయిసోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ రైటరే.. ప్రతి ఒక్కరూ ఎడిటరే.సోషల్ మీడియాను వ్యక్తిత్వ హననానికి ఉపయోగించడం దురదృష్టకరంమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Comments
Post a Comment