సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి: బస్సు ప్రమాదాలపై శ్రీ సత్యసాయి జిల్లాలో ఆందోళన

Malapati
0


ఉరవకొండ: ప్రైవేట్ ట్రావెల్ బస్సుల మితిమీరిన వేగం, రహదారుల దుస్థితి కారణంగా రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలపై ప్రయాణికులతో పాటు ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తాజాగా, చెన్నేకొత్తపల్లి వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మహిళ మృతి చెందడం ఈ ఆందోళనను మరింత పెంచింది.

 ప్రైవేట్ బస్సుల వేగానికి కళ్లెం వేయాలి: మోహన్ నాయక్ డిమాండ్

ఉరవకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో హరిత దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు బి. మోహన్ నాయక్ విద్యార్థులతో కలిసి గురువారం సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా బి. మోహన్ నాయక్ మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికులకు భయాన్ని కలిగిస్తున్నాయన్నారు. "ప్రతి రోజూ హైవేలపై బస్సులు నడుస్తున్నాయి, కానీ జాతీయ రహదారులపై ప్రయాణమంటేనే భయపడే పరిస్థితి నెలకొంది," అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

 వరుస ప్రమాదాలు:

 ఇటీవల కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనం అయ్యారు.

  అలాగే, తెలంగాణలోని చేవెళ్ల వద్ద జరిగిన ప్రమాదంలో కూడా 19 మంది మృతి చెందారు.

  తాజాగా, చెన్నేకొత్తపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి చెందారు.

ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం ప్రైవేట్ ట్రావెల్ బస్సుల మితిమీరిన వేగమే అని ఆయన ఆరోపించారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సుల దూకుడుకు ప్రభుత్వం వెంటనే కళ్లెం వేయాలని ఆయన డిమాండ్ చేశారు.

రోడ్ల పనుల పెండింగ్‌పై కూటమి ప్రభుత్వానికి విమర్శ


రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు అవుతున్నా, జాతీయ రహదారులపై గుంతలు పూడ్చకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని బి. మోహన్ నాయక్ విమర్శించారు.

కూటమి ప్రభుత్వం వెంటనే జాతీయ రహదారులపై పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తిగా చేసి, ప్రజల ప్రాణాలు కాపాడాలని" ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో రమణ, భాస్కర్, మణికంఠ, రామకృష్ణ, గణేష్, అశోక్, చంటి, బాబూరావు, ధర్మ కుమార్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!