![]() |
| రాష్ట్ర కమిటీ అత్యవసర సమావేశంలో ఎన్నిక |
విజయవాడ :ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ (AP PTD) – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) కార్మిక పరిషత్ యూనియన్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. సత్యసాయి జిల్లా, కదిరి డిపోకు చెందిన బి. పెద్దన్న (STi) యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నిన్న విజయవాడలో జరిగిన కార్మిక పరిషత్ రాష్ట్ర కమిటీ అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు శేషగిరిరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై. శ్రీనివాసరావు, రాష్ట్ర కోశాధికారి సురేంద్ర, రాష్ట్ర కార్యదర్శి ఈ. డి. ఆంజనేయులు, సీనియర్ నాయకుడు అజయ్ దేవానంద్ తదితరులు హాజరయ్యారు.
సమావేశంలో బి. పెద్దన్న యూనియన్‌లో అధికారికంగా చేరి, ఏకగ్రీవంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నాయకులు ఆయనకు శాలువా కప్పి ఘన స్వాగతం పలికారు.
కార్మిక పరిషత్ రాష్ట్ర నాయకులు బి. పెద్దన్నకు అభినందనలు తెలియజేస్తూ, ఆయన నాయకత్వంలో యూనియన్ మరింత బలపడుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు.

Comments
Post a Comment