ఉరవకొండను ప్లాస్టిక్ రహిత పంచాయతీగా తీర్చి దిద్దాలి.-రాష్ట్ర మాల మహానాడు ఉపాధ్యక్షులు మొలక రామాంజనేయులు.
అనంతపురం జిల్లా, ఉరవకొండ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో ప్లాస్టిక్ వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ రాష్ట్ర మాల మహానాడు ఉపాధ్యక్షులు శ్రీ మొలక బాల రామాంజనేయులు పంచాయతీ కార్యదర్శికి అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా రామాంజనేయులు మాట్లాడు తూ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా అరికట్టడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. తద్వారా ఉరవకొండను ప్లాస్టిక్ రహిత పంచాయతీగా తీర్చిదిద్దాలని ఆయన డిమాండ్ చేశారు.ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం అమలులో ఉన్నప్పటికీ, గ్రామ పంచాయతీ పరిధిలో యథేచ్ఛగా అమ్మకాలు జరుగుతున్నాయని శ్రీ మొలక బాల రామాంజనేయులు ఆరోపించారు. ముఖ్యంగా ఈ : సాధారణ దుకాణాలు.
హోటళ్లు : ఆహార విక్రయ సంస్థలు.
కిరాణా షాపులు: నిత్యావసర వస్తువుల దుకాణాలుమాంసం అమ్మే దుకాణాలు నిషేధాన్ని ఉల్లంఘిస్తూ విక్రయాలు సాగిస్తున్నాయని ఆయన ఫిర్యాదులో స్పష్టం చేశారు నిబంధనల ఉల్లంఘనపై మాత్రమే కాకుండా, ప్రజారోగ్యం మరియు పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించాలన్నారు ప్లాస్టిక్ రహిత పంచాయతీ లక్ష్యాన్ని సాధించడం ద్వారా స్థానిక పర్యావరణ కాలుష్యాన్ని, ముఖ్యంగా మురుగునీటి వ్యవస్థలో ప్లాస్టిక్ పేరుకుపోవడాన్ని అరికట్టవచ్చనని రామాంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు లో పేర్కొన్నారు..
ఆహార పదార్థాల కోసం ప్లాస్టిక్ వాడకంపై నిషేధాన్ని కఠినంగా అమలు చేయడం ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడవచ్చు.
ప్లాస్టిక్ నిషేధ చట్టాలు స్థానికంగా కఠినంగా అమలు అయ్యేలా చూడాలని రామాంజనేయులు పంచాయతీ కార్యదర్శి ని కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఫిర్యాదీ రామాంజనేయులు తెలిపారు.

Comments
Post a Comment