అనంతపురం జిల్లా ఉరవకొండలో మంచికి మారుపేరుగా అన్ని రంగాల్లో రాణించిన కవిత మహమ్మద్ (80)ఆదివారం కేరళలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతి ఉరవకొండ వాసులకు తీరని లోటు అని పలువురు ఆయన సేవలను కొనియాడారు
ఉరవకొండ లో పరిచయం అక్కర లేని వ్యక్తి మహమ్మద్. కేరళ కు చెందిన మహమ్మద్ ఉరవకొండ ప్రాంతానికి జీవనోపాది కోసం 45 సంవత్సరాల క్రితం వచ్చి హోటల్ రంగం లో స్థిరపడ్డారు. అతను హోటల్ కి కవితా హోటల్ పేరు పెట్టి దిన దిన ప్రవర్ధ మానంగా రాణించారు. కవిత హోటల్ లో 20మందికి ఎప్పుడూ ఉపాధి కలిపించారు.
ఉరవకొండ లో కవితా హోటల్ అన్నా, కవితా మహమ్మద్ అన్నా తెలియని వ్యక్తులు ఉండరు అంటే అతిశయోక్తి లేదు. తద్వారా కవితా కూడలి గా సర్కిల్ కి మంచి పేరు ఉంది.
మంచి కు మారుపేరు మహమ్మద్ : కవితా మహమ్మద్ అంటే మంచి కి మారు పేరుగా నిలుస్తారు.
ఉరవకొండ కాంగ్రెస్ లో రాజకీయ అరంగేత్రం:ఉరవకొండ వాసుల్లో చెరగని ముద్ర వేసుకొన్న మహమ్మద్ ముచ్చట గా మూడు సార్లు వార్డు సభ్యులు గా ఎంపిక అయ్యారు. అలాగే ఆయన రాజేవ్ గాంధీ వీరాభిమాని వార్డు సభ్యునిగా మొదలు టౌన్ బ్యాంక్ ఉపాధ్యక్షులు గా ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.
పొరుగు జిల్లా అయిన కర్ణాటక బళ్లారి జిల్లా లో కేరళ వ్యాపార సంఘాల అధ్యక్షులు గా పనిచేస్తూ ఎందరికో ఆదర్శం గా నిలిచారు.
దాన ధర్మ గుణం కల్గిన వ్యక్తి :పరోప కార గుణం కల్గిన వ్యక్తి ఆయన, పెదాలంటే పంచ ప్రాణాలు ఆయన కి చదువు కునే ఎందరో పేద విద్యార్తుల కు ఆయన పప్పు సాంబారు ఉచితంగా అందజేశారు. అలాగే హోటల్లో ఉచిత భోజనం ఏర్పాటు చేసిన ఘనత ఆయనకు దక్కుతుంది.
లయన్ క్లబ్ సేవల్లో తరించారు.
ఇది ఇలా ఉంటే 2o సంవత్సరాలు గా దర్గా మసీదుకు ప్రెసిడెంట్ గా ఉంటూ జీవితం తరించారు.
ఆధ్యాత్మికంగా, ప్రజా సేవకుడిగా, వ్యాపార దిగ్గజంగా బ్రతుకు బ్రతికించు అన్న సూక్తికి మంచికి మారుపేరుగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న మహమ్మద్ కేరళ నుంచి ఉరవకొండకు వచ్చి స్థిరపడి స్థిరపడి తిరిగి కేరళకు వెళ్లారు. 80 సంవత్సరాలు నిండిన కవితా మహమ్మద్ గత కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురై కేరళలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం సాయంత్రం కేరళలో ఆయన నివాస గృహంలో కన్నుమూశారు. మహమ్మద్ కు నలుగురు సంతానం వీరిలో ముగ్గురు కుమారులు ఒక కుమార్తె ఉంది.
మహమ్మద్ కన్నుమూత వార్త వినగానే ఉరవకొండ ప్రజల గుండెగుభేలు అయింది. ఆయన ఆత్మకు శాంతించాలని పలువురు ప్రార్థనలు చేశారు. మంచికి మారుపేరు మహమ్మద్ మంచికి మారుపేరు మహమ్మద్ అని మాలపాటి శ్రీనివాసులు, దేవరింటి పేర్కొన్నారు. పేదల పాలిట పెన్నిధిగా లెనిన్ అభివర్ణించారు. దానధర్మగుణం కలిగిన వ్యక్తి బ్రతుకు బ్రతికించు అన్న సూక్తికి మార్గదర్శకుడు కవితా మహమ్మద్ అని వార్డు సభ్యులు నిరంజన్ గౌడ్ చిదానంద తెలిపారు.
