వజ్రకరూరు, అనంతపురం జిల్లా: అనంతపురం జిల్లా వజ్రకరూరు మండల పరిధిలోని చాబాల గ్రామంలో వెలసిన శ్రీ చాబాల దర్గా వన్నూరు స్వామి దేవాలయం పునర్నిర్మాణ పనులకు ఆదివారం రోజున ₹1,11,116 (ఒక లక్ష పదకొండు వేల నూట పదహారు రూపాయలు) భారీ విరాళం అందింది.
బెంగుళూరులో నివసిస్తున్న మొపూరు శ్రీదేవి (బేబీ) మరియు విజయ్ ప్రసాద్ దంపతులు తమ వంతు సహాయంగా ఈ మొత్తాన్ని ఆలయ నిర్మాణ కమిటీకి వితరణ చేశారు.
ఆదివారం సాయంత్రం దాతలు ఈ విరాళాన్ని ఆలయ పునర్నిర్మాణ కమిటీ సభ్యులైన గొల్ల శ్రీనివాసులు, మైలారీ యాదవ సంఘం రాష్ట్ర కార్యదర్శి చల్లా అనంతయ్య, గొల్ల గోపాల్, గొల్ల నాగరాజు, గొల్ల మహేష్, గొల్ల, మైలారి, నారాయణప్ప శివలింగప్ప, ధనుంజయ్యలకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు లింగమూర్తి, డబ్బాల సూరి చంద్రమౌళి, దాతల కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు మరియు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దాతలైన మొపూరు శ్రీదేవి, విజయ్ ప్రసాద్ దంపతుల దాతృత్వాన్ని గ్రామ ప్రజలు, భక్తులు అభినందించారు.

Comments
Post a Comment