నిన్నటి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఢిల్లీ మొదలుకొని అమరావతి వరకు,నాయకులు,ప్రభుత్వ అధినేతల ప్రసంగాలు చూస్తే నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లు,వాటి నిండా గారడీ మాటలు,అసత్యాలు,అబద్ధాలేఅని రాష్ట్ర వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక ఉపాధ్యక్షులు కెవి రమణ ఆరోపించారు
ఏ పార్టీ అధికారంలో ఉంటే వారు సొంత రాజ్యాంగాన్ని రచించుకొని అమలు చేస్తున్న నేటి తరుణంలో దేశానికి రాజ్యాంగమే మూల స్తంభం, దేశాన్ని ముందుకు నడిపించే మార్గదర్శకపత్రం,స్వేచ్ఛ,సమానత్వాలు రాజ్యాంగ ఆశయాలని సిగ్గు మాలిన మోసపూరిత ప్రసంగాలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు.
రాజ్యాంగ పీఠికలో ఉన్న సర్వసత్తాక,సామ్యవాద,లౌకిక ప్రజాస్వామ్యం.సాంఘిక,ఆర్థిక, రాజకీయ సమన్యాయం. ఆలోచన,భావ ప్రకటన, విశ్వాసం,ధర్మాలను పాతిపెట్టి శ్రీరంగనీతులు వల్లిస్తే రాజ్యాంగ పత్రానికి న్యాయం జరుగుతుందా?అందుకే అంబేద్కర్ మహాశయుడు చెప్పినట్లు రాజ్యాంగం మంచి వాని చేతిలో ఉంటే మనుషుల తలరాతలను మారుస్తుంది, లేకుంటే చిత్తు పేపరు గా మారిపోతుంది అన్నట్లు పాలకులు రాజ్యాంగాన్ని చిత్తు పేపర్ గా మార్చేసి, ప్రతి ఏటా రాజ్యాంగ దినం నాడు జాతిని ఉద్దేశించి శ్రీరంగనీతులు వల్లిస్తే రాజ్యాంగ పీఠికు న్యాయం జరుగుతుందా? జాతికి మేలు జరుగుతుందా? అందుకే ఆచరణ లేని సిద్ధాంతం గుడ్డిది సిద్ధాంతం లేని ఆచరణ చెవిటిది,అన్నట్లుగా భారత రాజ్యాంగం విలపిస్తున్నది.
ప్రభుత్వ విధానాలను స్వేచ్ఛగా చర్చించి, విమర్శనాత్మకంగా సరి చేసే దమ్ము ధైర్యం ప్రజలకు కలుగచేయ లేని నేటి రోజులలో రాజ్యాంగాన్ని గురించి మాట్లాడే అర్హత పాలకులకు ఉన్నదా?నేటికీ దేశంలో మైనార్టీమతస్తులు, బహుజనులు అంటరానితనం,అభద్రతా భావంతో బతుకుతున్నారంటే, ఆర్థిక,సామాజిక,రాజకీయ అసమానతలతో కొట్టుమిట్టాడుతున్నారంటే పాలకులకు సిగ్గుగా లేదా? ఏనాడైతే స్వేచ్ఛగా మాట్లాడగలిగి,చర్చించి,విమర్శించ గలుగుతారో ఆనాడే రాజ్యాంగ పీఠక సజీవం,లేకుంటేనిర్జీ వమని వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర ఉపాధ్యుక్ష్యలు కే వీ రమణ పేర్కొన్నారు.

Comments
Post a Comment