![]() |
4 నెలల్లోనే 8.6 కి.మీ మార్గం నిర్మాణం |
సకాలంలో పూర్తి చేసిన పనులు
ఈ రహదారి పనులను స్వయంగా మంత్రి పయ్యావుల కేశవ్ గారు పర్యవేక్షించారు. జూలై 5న గడేకల్లు గ్రామంలో భూమిపూజ చేసి పనులను ప్రారంభించిన ఆయన, కాంట్రాక్టర్‌కు నాలుగు నెలల్లోనే నాణ్యతతో కూడిన రహదారిని పూర్తి చేయాలని స్పష్టమైన సూచనలు ఇచ్చారు. మంత్రి వ్యక్తిగత పర్యవేక్షణ, ఎప్పటికప్పుడు సమీక్షల కారణంగా పనులు వేగవంతమై, అనుకున్న సమయానికి ముందే పూర్తి చేయబడ్డాయి.
మండల కేంద్రానికి మెరుగైన అనుసంధానం
ఈ నూతన రహదారి పూర్తికావడంతో విడపనకల్లు మండలంలోని అనేక గ్రామాలకు మండల కేంద్రానికి చేరుకోవడం సులభమైంది. ప్రధానంగా విడపనకల్లు, ఆర్. కొట్టాల, గడేకల్లు, డోనేకల్లు, కడధరబెంచి, ఎన్. తిమ్మాపురం, పెంచలపాడు, పోలికి వంటి గ్రామాల ప్రజలకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడింది.
ప్రతిరోజూ వందలాది ద్విచక్ర వాహనాలు, ఆటోలు, జీపులు, ట్రాక్టర్లతో మండల కేంద్రానికి రాకపోకలు సాగించే ప్రజలకు కొత్త బీటీ రహదారి విశేష ఉపశమనాన్ని ఇచ్చింది. మెరుగైన రహదారి కారణంగా ప్రయాణ సమయం తగ్గి, వాహనాల రాకపోకలు మరింత సులభంగా మారాయి. ముఖ్యంగా రోజువారీ పనులకు వెళ్లే వారికి, తమ పొలాలకు వెళ్లే రైతులకు ఇది ఎంతో మేలు చేసింది.
ఏపీఎస్ఆర్టీసీ సేవలకు ప్రయోజనం
ఈ రహదారి మీదుగా ప్రస్తుతం విడపనకల్లు – గుంతకల్లు మార్గంలో ఏపీఎస్ఆర్టీసీ బస్సు రోజుకు 6 సార్లు రాకపోకలు సాగిస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఉండటం వలన ఈ బస్సు సేవలు నిత్యం రద్దీగా ఉంటున్నాయి. రహదారి మెరుగుపడడం వలన భవిష్యత్తులో బస్సు సేవలను మరింత విస్తరించేందుకు అవకాశం ఏర్పడింది
మంత్రికి మాలపాటిశ్రీనివాసులు, మధుబాబు,ఏళ్ళ హరి ప్రజల కృతజ్ఞతలు
చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఈ ప్రధాన రహదారి పనులను కేవలం నాలుగు నెలల్లోనే అత్యంత నాణ్యతతో పూర్తి చేయించినందుకు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కుగ్రామీణ సేవా సమితి జిల్లా అధ్యక్షులు మాలపాటి శ్రీనివాసులు, సహచ జిల్లా కార్యదర్శి మీనుగ మధుబాబు గడే కల్ తెలుగు యువత నాయకులు ఏళ్ళ హరి స్థానిక ప్రజలు, రైతులు కృతజ్ఞతలు తెలిపారు.మంత్రి పయ్యావుల అభివృద్ధి ని పరుగులు తీయిస్తున్నారని వారు తెలిపారు .


Comments
Post a Comment