మార్కాపురం: మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు.
అప్పటికప్పుడే కొన్ని సమస్యల పరిష్కారం
ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రజల నుండి నేరుగా అర్జీలను స్వీకరించారు. అనంతరం అధికారులతో తక్షణమే మాట్లాడి, ప్రజల సమస్యల్లో కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు.
అనంతరం శాసనసభ్యులు మీడియాతో మాట్లాడుతూ, ప్రజాదర్బార్ ముఖ్య ఉద్దేశం ప్రజల సమస్యలను పరిష్కరించడమేనని తెలిపారు. "కొన్ని సమస్యలను ఇప్పటికే పరిష్కరించాం. మరికొన్నింటిని వచ్చే పదిహేను రోజుల్లో పూర్తి చేస్తాం. ఒకవేళ పరిష్కారం కాని సమస్యలు ఉంటే, అది ఎందుకు కాలేదో కూడా అర్జీదారులకు తెలియజేస్తాం" అని ఆయన వివరించారు.
వైసీపీ విమర్శలపై ఎమ్మెల్యే కౌంటర్
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నాయకులపై విమర్శలు గుప్పించారు. వైసీపీ నాయకులకు పనిపాట లేక తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు.
మా నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా లోకేష్ బాబు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిత్యం కష్టపడి రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారిస్తున్నారు. ఇది ఓర్వలేకనే వైసీపీ నాయకులు 'కోటి సంతకాలు' అంటూ రోడ్డు మీద పడ్డారు. ఇక మీ ప్రభుత్వం ఎప్పటికీ రాదు, ఈ విషయాన్ని వారు గుర్తుంచుకోవాలి" అని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి స్పష్టం చేశారు.


Comments
Post a Comment