తలనీలాల హక్కు వేలం వాయిదా
తలనీలాలు ప్రోగు చేసుకోను హక్కు కోసం నిర్వహించిన ఈ-టెండర్ మరియు షీల్డ్ టెండర్‌కు ఏ ఒక్క టెండర్ దారుడు కూడా ముందుకు రాలేదు. అనంతరం నిర్వహించిన బహిరంగ వేలంలో ముగ్గురు డిపాజిట్ చెల్లించగా, ఇద్దరు మాత్రమే పాటలో పాల్గొన్నారు. పాట రూ. 15,20,000/- (పదిహేను లక్షల ఇరవై వేల రూపాయలు) వద్ద నిలిచిపోయింది. గత సంవత్సరంలో ఇదే హక్కుకు రూ. 27,00,000/- (ఇరవై ఏడు లక్షల రూపాయలు) కంటే తక్కువకు పాట ఆగినందున, దేవస్థానం అధికారులు వేలాన్ని వాయిదా వేశారు.
పాత్ర సామానుల అద్దె హక్కుకు సరైన పాట కరువు
అదేవిధంగా, పాత్ర సామానులు బాడుగకు ఇచ్చుకొను హక్కుకు నిర్వహించిన షీల్డ్ టెండర్‌కు కూడా ఎవరూ స్పందించలేదు. బహిరంగ వేలంలో నలుగురు డిపాజిట్ కట్టి, ముగ్గురు పాట పాడగా, పాట రూ. 2,00,000/- (రెండు లక్షల రూపాయలు) వద్ద ఆగిపోయింది. గత ధరలతో పోలిస్తే సరైన పాట రానందున ఈ వేలాన్ని కూడా నిలుపుదల చేసి వాయిదా వేశారు.
నిలిచిపోయిన మరో వేలం: 13-08-2025 నుండి 18-11-2025 వరకు ప్రోగు చేసిన తలనీలాల హక్కుకు పాట పాడుకొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
భూముల కౌలు వేలానికి గుత్తదారులు గైర్హాజరు
మధ్యాహ్నం 2:00 గంటలకు దేవస్థానం భూములను కౌలుకు ఇచ్చేందుకు నిర్వహించిన వేలానికి గుత్తదారులు ఎవరూ హాజరు కాకపోవడంతో, ఆవేలాన్ని కూడా వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ వేలం ప్రక్రియను ఆలయ కార్యనిర్వహణాధికారి సి.ఎన్. తిరుమల రెడ్డి పర్యవేక్షణాధికారి వై. రమేష్, జూనియర్ అసిస్టెంట్, ఉప కమిషనర్ కార్యాలయం (కర్నూలు) వారి సమక్షంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వి షేక్షానపల్లి విజయ భాస్కర్, రాయంపల్లి నాగరాజు, మోపిడి గోవింద్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Comments
Post a Comment