పాల్తూరులో ఘనంగా కడ్లే గౌరమ్మ వేడుకలు.
November 06, 2025
0
ఉరవకొండ నియోజకవర్గం పరిధిలోని విడపనకల్ మండల పాల్తూరు గ్రామంలో గురువారం కడ్లే గౌరమ్మవేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు వీధుల నుంచి కడ్లే గౌరమ్మకు హారతులు ఇచ్చి మొక్కబడును తీర్చుకున్నారు. సాయంత్రం పలు వీధి నుంచి మహిళలు హారతులతో గ్రామం కిటకిటలాడింది. ఈ సందర్భంగా కడ్లే గౌరమ్మ విగ్రహానికి వివిధ పుష్పాలతో, వివిధ చీరలతో ఆభరణాలతో సుందరంగా అలంకరించారు. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు తరలివచ్చి పూజల అభిషేకలు చేయించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు.
