ఉరవకొండ : వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు శుక్రవారం జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం కార్యక్రమం మండల వైద్యాధికారి డాక్టర్ తేజస్వి, డాక్టర్ సర్దార్ వలి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వైద్య అధికారులు మాట్లాడుతూ.... రాష్ట్ర ప్రభుత్వం 18 సంవత్సరాలు పైబడిన ప్రతి పౌరునికి ఉచితంగా నోటి, రొమ్ము మరియు గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ సదుపాయం కల్పిస్తుంది ఈ పరీక్షలు చేయించుకోవడానికి మీ ఇంటి వద్దకు వచ్చే ప్రభుత్వ ఆరోగ్య సిబ్బందికి ప్రజలు సహకరించాలన్నారు. మీ సమీపంలోని ప్రతి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఈ పరీక్షలు పూర్తిగా ఉచితంగా చేయబడతాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసమే ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు అన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలన్నారు. క్యాన్సర్ వ్యాధి అంటే భయపడాల్సిన అవసరం లేదు ముందుగానే గుర్తిస్తే పూర్తిగా నయం చేయగల వ్యాధి ఇది ఈ వ్యాధి కొందరికి మాత్రమే వస్తుంది నాకు రాదని అపోహాలు వదిలేయాలి అన్నారు. క్యాన్సర్ లేని సమాజాన్ని నిర్మించడానికి స్వచ్ఛంద కార్యకర్తలు, ప్రజలు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ సత్యనారాయణ, ఎం పి హెచ్ ఈ ఓ గురు ప్రసాద్, సూపర్వైజర్ నాగ శంకర్, ఎం ఎల్ హెచ్ పి భారతి, ఏఎన్ఎంలు లక్ష్మి, జయమ్మ, ల్యాబ్ టెక్నీషియన్ లలిత, ఫార్మసిస్ట్ రామచంద్రనాయక్, హెల్త్ అసిస్టెంట్లు సంపత్ కుమార్, నాగరాజ్, స్వచ్ఛంద సేవా కార్యకర్త ఎంపీ మల్లికార్జున, అంగన్వాడి కార్యకర్తలు ఆశా కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.