రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కళ్యాణదుర్గం పట్టణంలో జరగనున్న భక్త కనకదాసు జయంతి మహోత్సవంలో పాల్గొనేందుకు జిల్లాకు విచ్చేయగా, ఉరవకొండ ఎమ్మెల్యే, ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు.
పుట్టపర్తి ఎయిర్‌పోర్టులో స్వాగతం
నారా లోకేష్ రాక సందర్భంగా పుట్టపర్తి ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న మంత్రి పయ్యావుల కేశవ్, ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.
మంత్రి నారా లోకేష్ ఈ నెల 8వ తేదీ సోమవారం నాడు కళ్యాణదుర్గంలో జరిగే భక్త కనకదాసు జయంతోత్సవాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా రెండు జిల్లాల మంత్రులు కొద్దిసేపు చర్చించుకున్నట్లు సమాచారం.

Comments
Post a Comment