పీపిపీ విధానాన్ని రద్దు చేయాలి.. ఐసా

Malapati
0

 

మెడికల్ కాలేజీల పిపిపి విధానాన్ని రద్దు చేయాలని,విద్యాసంస్థల్లోకి విద్యార్థి సంఘాల ప్రవేశాన్ని నిషేధించిన ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయాలని ఐసా రాష్ట్ర సమితి పిలుపు మేరకు సోమవారం ఉరవకొండ పట్టణంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఏఐఎస్ఏ మండల అధ్యక్షులు మంజునాధ్ మాట్లాడుతూ.... రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17 మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వ విధానం ద్వారా ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నది.

17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పె ఈ పబ్లిక్ ప్రైవేటు పార్టనర్షిప్ విధానాన్ని ఆపాలని ఐసా డిమాండ్ చేశారు.తక్షణం పీ పీ పీ విధానం రద్దు చేసి ప్రభుత్వమే మెడికల్ కళాశాలను నడపాలని కోరారు.అదే విధంగా విద్యా సంస్థలు లోకి విద్యార్థి సంఘాలు ప్రవేశించకుండా తీసుకువచ్చిన GO నెంబర్ 3 ను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.


అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణం చెల్లించాలని కోరారు.లేని పక్షంలో రానున్న రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వంకు బుద్ధి చెప్పేలా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను ఉదృతం చేస్తామని మంజునాథ్ ఈ సందర్భంగా హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో నాయకులు శివకుమార్, రాజేష్, వంశీ, సురేష్, హరి, ఈశ్వర్, రమేష్, తదితరులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!