జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు.:మాలపాటి శ్రీనివాసులు

Malapati
0

 


 అకుంఠిత దీక్ష అంకితభావంతో ప్రజా సమస్యలను తమ భుజాల మీద వేసుకొని ఎప్పటికప్పుడు అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వం దృష్టికి తెచ్చే పాత్రికేయులందరికీ జాతీయ పత్రికా దినోత్సవ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు.

 భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 16వ తేదీన జాతీయ పత్రికా దినోత్సవాన్ని జరుపుకుంటారు.1956లో భారత తొలి ప్రెస్ కమిషన్ సిఫార్స్ మేరకు, 1966 నవంబర్ 16వ తేదీన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (Press Council of India) ను ఏర్పాటు చేశారు. అప్పటి నుండి, పత్రికా స్వేచ్ఛ యొక్క ప్రాధాన్యతను గుర్తించడానికి మరియు జర్నలిజంలో ఉన్నత ప్రమాణాలను ప్రోత్సహించడానికి ఈ రోజును జరుపుకుంటున్నారు.

 ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లక్ష్యం:

   అధికారంలో ఉన్న వ్యక్తుల చేత లేదా వ్యవస్థల ఇష్టాయిష్టాల వల్ల పత్రికలు ప్రభావితం కాకుండా, అత్యున్నత ప్రమాణాలను పాటించేలా చూడటం దీని ముఖ్య లక్ష్యం పత్రికా స్వేచ్ఛను కాపాడటం మరియు పత్రికా రంగానికి ఎదురయ్యే సవాళ్లు, సమస్యల గురించి చర్చించడానికి ఇది ఒక వేదికగా పనిచేస్తుంది.

   ప్రభుత్వ శాఖలపై కూడా తన అధికారాన్ని వినియోగించే అవకాశం ఈ కౌన్సిల్‌కు ఉంది.

--సీనియర్ పాత్రికేయులు, మాలపాటి శ్రీనివాసులు, ఉరవకొండ, అనంతపురం జిల్లా :9492656244

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!