![]() |
| హెచ్ ఎమ్, ఎం ఈ ఓ లను సస్పెండ్ చేయాలి. బాధితుల తల్లి దండ్రుల డిమాండ్. |
ఉరవకొండ : అక్షరాలు నేర్పే అయ్యవారు అసభ్యంగా అనాగరికంగా ప్రవర్తించడం న్యాయమా అంటూ బంజారా సంఘం ప్రతినిధి ఎస్ కే సుబ్రహ్మణ్యం నాయక్ ప్రశ్నించారు బుధవారం ఆ సంఘం విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి పాత్రికేయులతో మాట్లాడారు ఈ సందర్భంగా వజ్రకరూరు మండలం వెంకటం పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఎన్ఎస్ టీచర్ గత 15 రోజులుగా ఏడు ఎనిమిది తొమ్మిది పదో తరగతి విద్యార్థులు పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ పైశాచిక ఆనందం పొందుతూ గడిపిన సంఘటన బహిర్గతమైనాయని విద్యార్థుల తల్లితండ్రులు గ్రామస్తులు ఉపాధ్యాయుల తీరు పట్ల నిరసన వ్యక్తం చేశారు అధికారులు స్పందించి ఎన్ఎస్ టీచర్ సస్బెండ్ చేస్తూ డిఇఓ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. అయితే ఉపాధ్యాయులు నిర్లక్ష్యం పట్ల పరోక్షంగా సహకరించిన ప్రధానోపాధ్యాయుల పైన అలాగే మండల విద్యాశాఖ అధికారి పైన శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు 8వ తేదీ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విచ్చేయుచున్నారని ఈ సందర్భంగా ఇటీవల జరిగిన వెంకటం పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమస్య పట్ల స్పందించి బాధ్యులైన ఎంఈఓ హెచ్ఎం లను కూడా సస్పెండ్ చేయాలని బంజారా సంఘం డిమాండ్ చేసింది.


Comments
Post a Comment