చట్టం,న్యాయం అందరికీ సమానమే అన్నది ఒట్టి మాటలే అని,దున్నలు దున్నలు పోట్లాడితే దూడలకు కాళ్లు విరిగినట్లు,సీఐ శంకరయ్య ఉద్యోగం తొలగింపు ద్వారా మరొక్కసారి రుజువు అయ్యింది.
బహుజనుల న్యాయ పోరాటం పై అగ్రకుల రాజ్యం చేసిన దాడిలో భాగమే బహుజన సిఐ శంకరయ్య ఉద్యోగం తొలగింపు.
అగ్రకుల రాజ్యం బహుజనుల కళ్లను బహుజనులతోనే పొడిపిస్తుంది.అందులో భాగమే బహుజన డి ఐ జి కోయ ప్రవీణ్ చేతితో మరో బహుజన కురవ సిఐ ని ఉద్యోగం నుండి తొలగింప చేసింది.
ఇంతకీ సీఐ శంకరయ్య చేసిన నేరం ఏమిటి?అతను కత్తి పట్టుకుని యుద్ధం చేయలేదు,కేవలం తనకు జరిగిన అవమానానికి, అన్యాయానికి వ్యతిరేకంగా న్యాయస్థానాలను ఆశ్రయించడమే.అంటే అగ్రకుల రాజ్యంలో బహుజనులు న్యాయ పోరాటం కూడా చేయడానికి వీలులేదు,ప్రశ్నించకూడదు.
నేడున్న అగ్రకుల రాజ్యం సిఐ గారిని తొలగిస్తుంది,రేపు వచ్చే అగ్రకుల రాజ్యం డి ఐ జి కోయ ప్రవీణ్ గారిని తొలగించదన్న గారెంటీ లేదు,అందుకే బహుజనులు తమ ఉద్యోగాలకున్న విషేషాధికారాలను విజ్ఞతతో వినియోగించుకోవడం వల్లనే ఉమ్మడి బహుజన ప్రయోజనాలు నెరవేరుతాయని గ్రహించాలి.
అగ్రకుల రాజ్యం చేతిలో ఉన్న మీడియా,ముఖ్యమంత్రి గారి మీదనే ఒక బహుజన సీఐ పరువు నష్టం దావా వేస్తాడా? అని ప్రశ్నిస్తుంది. అంటే బహుజన సమాజం అగ్రకుల సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి, న్యాయస్థానాలకు వెళ్లడానికి వీలు లేదని నిర్ధారిస్తుంది.దీన్ని జర్నలిజం అంటారా?అగ్రకుల రాజ్య దురహంకారానికి కాపు కాయడం అంటారా?
చట్టం,న్యాయం అందరికీ సమానమైనప్పుడు బహుజన సమాజం న్యాయస్థానాలను కూడా ఆశ్రయించడానికి వీలులేదని,భయపడించడం ప్రజాస్వామ్యమా?నియంతృత్వమా?
తప్పు చేయనప్పుడు ఎవరు ఎవరికైనా భయపడాల్సిన అవసరం ఏమిటి?అతనిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేసాడన్న కసితో ఉద్యోగం నుండి తొలగించడంతోనే అగ్ర కుల రాజ్యం తప్పు చేసిందని రుజువు అయ్యింది.
కావున శంకరయ్యను అప్రజాస్వామికంగా తొలగించిన వారిని న్యాయస్థానం కఠినంగా శిక్షించి,అవమానించిన వారికి భారీగా పరువు నష్టం చెల్లించేటట్లు చేసి, శంకరయ్యను యధాతధ స్థితిలో నిలపాలని బహుజన సమాజం గొంతెత్తి అరుస్తున్నది.
బహుజన ఉద్యోగులు స్వేచ్ఛగా పని చేయడానికి వీలులేదని, వారు మా చేతిలో కీలుబొమ్మలని అగ్రకుల రాజ్యం హెచ్చరిస్తున్నది.మరి వారు చెప్పినట్లుగా అణిగి పని చేద్దామా?తిరుగుబాటు చేద్దామా?
కేవీ రమణ,జిల్లా అధ్యక్షులు, బెస్త సేవా సంఘం, అనంతపురం జిల్లా.

Comments
Post a Comment