ఉరవకొండ
పట్టణం లో ఎమ్ పీ పీ యస్ సెంట్రల్ స్కూల్ లో బాల దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా ఉన్న మన సెంట్రల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు మరియు టీచర్లు అయిన S. శ్రీనివాసులు , D. శ్రీనివాసులు , K. హరికృష్ణ , P. చంద్రశేఖర్ నెహ్రూ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు
మన దేశానికి ఆశాదీపాలైన న ప్రియమైన విద్యార్థులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలుతెలిపారు.
వక్తలు వేడుక ప్రముఖ్యత వివరించారు. మన దేశానికి మొదటి ప్రధానమంత్రి అయిన పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు. నెహ్రూ గారికి పిల్లలంటే ఎంతగానో ఇష్టం. ఆయన పిల్లలను "రేపటి దేశ నిర్మాతలు" అని అనేవారు. అందుకే ఆయన్ను మనం ముద్దుగా చాచా నెహ్రూ అని పిలుస్తాం.
ఆయన జ్ఞాపకార్థం, పిల్లల పట్ల ఆయనకున్న ప్రేమను స్ఫూర్తిగా తీసుకుని, ఈ రోజును మన బాల్యం యొక్క విలువను గుర్తుచేసుకోవడానికి కేటాయించారని వక్తలు తెలిపారు.
మరో వక్త కరెంట్ గోపాల్ మాట్లాడుతూ బాలలారా, మీరే మన నిజమైన శక్తిగా అభివర్ణించారు.
నేను గ్రామ పంచాయతీలోఉక్కీసుల గోపాల్ సీనియర్ ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తాను. ప్రతి ఇంటికి, ప్రతి పాఠశాలకు వెలుగు ఇవ్వడం మా పని. వెలుగు ఉంటేనే అభివృద్ధి సాధ్యం.
అలాగే, మీరు కూడా మన సమాజానికి, మన గ్రామానికి నిజమైన వెలుగులు. మీలో ప్రతి ఒక్కరిలో అపారమైన శక్తి, గొప్ప తెలివితేటలు, అద్భుతమైన కలలు ఉన్నాయి.
కలలు కనండి: పెద్ద పెద్ద కలలు కనండి. ఆ కలలను నిజం చేసుకోవడానికి కష్టపడి చదవండి. మీ ఉపాధ్యాయులు చెప్పే ప్రతి మాటను శ్రద్ధగా వినండి.
ఆరోగ్యంగా ఉండండి: ఆటలు ఆడండి, పౌష్టికాహారం తీసుకోండి. ఆరోగ్యంగా ఉన్నప్పుడే మీ మెదడు చురుకుగా పనిచేస్తుంది.
మంచి పనులు చేయండి: పెద్దలను గౌరవించండి, తోటి స్నేహితులకు సహాయం చేయండి. మీలో ఉన్న మంచి గుణమే మిమ్మల్ని రేపటి గొప్ప పౌరులుగా మారుస్తుంది.
చాచా నెహ్రూ చెప్పినట్టుగా, నేటి బాలలే రేపటి ప్రపంచాన్ని నడిపిస్తారు. ఈ రోజు మీరు బాగా చదివితే, రేపు మీరే మన దేశాన్ని ముందుకు నడిపే డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు లేదా గొప్ప నాయకులు అవుతారని ఆశా భావం వ్యక్తం చేశారు.
మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటూ, మళ్లీ ఒకసారి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ అవకాశం ఇచ్చిన టీచర్లకు జై హింద్ అంటూ ధన్యవాదాలు తెలియజేశారు.
ఎంపీపీస్ సెంట్రల్ స్కూల్, దాని ఉపాధ్యాయులు (S. శ్రీనివాసులు, D. శ్రీనివాసులు, K. హరికృష్ణ, P. చంద్రశేఖర్ లెనిన్ బాబు, వార్డు సభ్యులు నిరంజన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment