Skip to main content

అదృశ్యమైన బాలిక ఆచూకీ కొరకు విజ్ఞప్తి

 


అనంతపురం పట్టణం, HLC కాలనీకి చెందిన శ్రీ M. వెంకట రమణారెడ్డి గారి కుమార్తె మాచిరెడ్డి హర్షిత (17 సం||) ఈ రోజు తేదీ 20.11.2025న తెల్లవారుజామున ఇంటి నుండి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయారు. ఈమె నలంద జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు.

బాలిక వివరణ:

 * ఎత్తు: 5.3 అడుగులు

 * రంగు: చామనచాయ

పై ఆచూకీ గల బాలిక ఎవరికైనా కనిపించినా లేదా సమాచారం తెలిసినా వెంటనే అనంతపురం 3వ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తెలియజేయగలరు.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:

 * Inspector of Police: 94906 18679

 * Sub-Inspector: 93469 17115

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...