పీడీ ఎస్ యూ రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్
అనంతపురం నగరంలో ఎల్బీనగర్ లో పీ డీ ఎస్ యూ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు కె . భాస్కర్, జిల్లా కార్యదర్శి వీరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్య విద్యాశాఖ మంత్రివర్యులు రాష్ట్రంలో ప్రభుత్వం మెడికల్ కళాశాలలో నడపడానికి బడ్జెట్ లేదని చెప్పడం దుర్మార్గమని అన్నారు. రాష్ట్రంలో 10 మెడికల్ కళాశాలను ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్(పిపిపి) విధానంలో నిర్వహిస్తామని క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించడం సరికాదని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలన్నింటిని ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గత 18 నెలలుగా తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల వైద్య విద్యను వ్యాపారమయం చేసి కార్పొరేట్ కబంధహస్తాల చేతులలో పెడుతున్నారు. మెడికల్ కళాశాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించలేమని జాతీయ మెడికల్ కౌన్సిల్ కి లేఖ రాయడం వల్ల 2024 -25 విద్యా సంవత్సరంలో 1800 మెడికల్ సీట్లు రాష్ట్రంలో పేద విద్యార్థులు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. మెడికల్ కళాశాల భూముల్ని 66 సంవత్సరాలకు కార్పొరేట్ వ్యక్తులకు లీజుకిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో విశాఖపట్నంలో గూగుల్ కంపెనీలకు రాయితెలిచ్చి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నారు కానీ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నడపడానికి డబ్బులు లేవని చెప్పడం సరైనది కాదని దుర్మార్గమని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మంత్రులు స్పెషల్ హెలికాప్టర్ కోసం కొన్ని కోట్ల రూపాయలు ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తూ పర్యటనలు చేస్తున్నారు కానీ, ప్రభుత్వం మెడికల్ కళాశాల ఏర్పాటు చేయమని చెప్పడం సరైనది కాదని అన్నారు. కావున కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాలు సరైనవి కాదని తక్షణమే ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మెడికల్ కళాశాలను రాష్ట్ర ప్రభుత్వాo నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమైతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీ డీ ఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల ప్రసాద్, జిల్లా నాయకులు ఉదయ్, మహేంద్ర, ఆనంద్, మురళి, వినోద్ మొదలైన వారు పాల్గొన్నారు.

Comments
Post a Comment