-గత ఈఓ నయం... నూతన ఈఓ రాక తో భయం భయం
-సిబ్బంది లేక ఇబ్బంది.
ఆకాశ దీపాల్లా ఆ నలుగురు సిబ్బంది.
అనంతపురం జిల్లా పెన్నహోబిలం, సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ఈవో బాధ్యతలను ఓ భూ బకాసురునికి మళ్లీ అవినీతికి కిరీటం సమర్పిస్తున్నట్లు సమాచారం. గుంతకల్ గ్రూప్ టెంపుల్ అధికారిగా ప్రస్తుతం ఆయన పనిచేస్తున్నారు. గతంలో ఆయన కోట్లాదిరూపాయలు విలువ చేసే ఉరవకొండ గవి మట సంస్థానానికి చెందిన భూమిని కబ్జా చేశారు. తొలత ఆయన్ని సస్పెండ్ చేయగా తిరిగి భూమిని అప్పగిస్తానని చెప్పి హామీ పత్రం రాయించి తిరిగి ఉద్యోగం పొందారు. దీంతో ఏసి స్థాయి నుంచి అతన్ని గ్రూప్ టెంపుల్ అధికారి గా నియమించారు. కర్నూల్ లో పనిచేస్తున్న ఆయన తిరిగి గుంతకల్ కు రాగా గుంతకల్ నుంచి ప్రస్తుతం పెన్హోబిలం దేవస్థానానికి ఆ అవినీతి అధికారిని ఈవోగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడానికి రంగం సిద్ధం చేశారు.
ఉరవకొండ పట్టణానికి చెందిన ఆ అధికారి 22 ఎకరాల గవి మట భూమిని చేల్లగురికి లో అప్పనంగా కబ్జా చేశారు. గవి మఠానికి చెందిన శ్రీ జగద్గురు కరిబసవ రాజేంద్ర స్వామి పేరిట ఉన్న ఈ భూమిని వారు రికార్డులు తారుమారు చేసి ఆ అధికారి తన కుటుంబ సభ్యుల పేరిట అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ సైతం చేయించారు. దీనితో సహచ జిల్లా కార్యదర్శి మీనుగ మధుబాబు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదే క్రమంలో ఆయన లోకాయుక్తలో కేసు వేశారు. లోకాయుక్త వారు ఆ అధికారి మరియు అతని కుటుంబ సభ్యులపై బళ్ళారి తాలూకా పీడీ హళ్లి పోలీస్ స్టేషన్లో 420 సెక్షన్ కింద చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆయన అరెస్టు కాకుండా కర్ణాటక హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ పొందారు. కాగా కేసు ఇప్పటికీ కొనసాగుతోంది.
ఈ క్రమంలో సదరు అధికారి ఏసి స్థానం నుంచి రివర్స్ పరమోషన్ ఇచ్చి గ్రూప్ టెంపుల్ అధికారిగా నియమించారు తొ
లత కర్నూలుకు, ఆ తర్వాత గుంతకల్లుకు బదిలీ చేశారు.
కోట్లాది రూపాయల విలువ చేసే మఠ భూమిని జగద్గురు కరిబసవ స్వామి పేరు తొలగించి తాము సొంతంగా సంపాదించిన భూమి అన్నట్లు గా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని కబ్జాకు పాల్పడ్డారు.
సాక్షాధారాలతో సహా నిరూపితమైన ఈ భూభాగోతం విషయానికి కీలక సూత్రధారి,పాత్రధారి కి తిరిగి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈవో బాధ్యతలు అప్పగిస్తే తిరిగి భూ అక్రమాలకు పాల్పడరు అనే గ్యారెంటీ ఏముంది.
పెన్నహోబిలం దేవస్థానానికి 15oo ఎకరాల భూమి ఉంది. ఇది ఎంతో విలువ చేస్తుంది. ఈ భూములపై ఆ అవినీతి అధికారి కన్నేశారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే రథ నిర్మాణానికి లక్షలాది రూపాయలు నిధులు మూలుగుతున్నాయి. అక్రమార్కుడి రాకతో భూములు నిధులు పక్కదారి పట్టే ఆస్కారం ఉందనిభక్తుల్లో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భూ బకాసురుడు అవినీతిపరుడ్ని నియమించద్దని భక్తులు వేడుకుంటున్నారు.
ఆగిన ఆలయ అభివృద్ధి : తిరోగమనమా పురోగమనమా? శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన అభివృద్ధికి బ్రేకులు పడ్డాయి. వేలాది ఎకరాల భూములు ఉన్నాయి. లక్షలాది రూపాయల రథ నిర్మాణానికి నిధులు మూలుగుతున్నాయి. స్వామివారికి అన్నీ ఉన్నా అల్లుడి నోట శని అన్న చందంగా మారింది.
గత ఈవో నయం.. ప్రస్తుత ఈవో అంటే భక్తులకు భయం : ఉరవకొండ ప్రాంతవాసి గత ఈవో రథ నిర్మాణానికి విరాళాల సేకరణకు కీలక భాగస్వామి అయ్యారు. నిపుణుల చేత రథం తయారు చేయించడానికి కార్యోన్ముఖులయ్యారు. ఈ క్రమంలో ఆయన తన వ్యక్తిగత కారణాలతో సెలవులో ఉన్నారు. దీంతో ఆయన స్థానంలో అనంతపురం ఏసీ కి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు.. రెడ్డి వచ్చి మొదలు పెడతాడు అని భావించిన భక్తులకు నిరాశ ఎదురయ్యింది. గతంలో పనిచేసిన ఈవోకు దేవస్థానం పై పట్టుంది. ఆయన శ్రీ లక్ష్మీనరసింహుని వీరభక్తుడు. ఈవో సిబ్బందిని, భక్తులను, ప్రజా ప్రతినిధులను కలుపుకుపోయి అభివృద్ధికి నడుం బిగించారు. ఆయన వ్యక్తిగత సెలవుతో అభివృద్ధికి ముగుతాడుపడిందని భక్తులు ఆరోపిస్తున్నారు.దేవస్థాన భూములను రీసర్వే చేయించి ఆలయ అభివృద్ధికి అడుగడుగునా కృషి చేశారు. రథ నిర్మాణానికి ప్రత్యేక చొరవ చూపి ప్రజలను భక్తులలో అవగాహన కల్పించి భారీవిరాళాల సేకరణలో కీలక భూమిక పోషించారని భక్తుల ఉవాచ.
సీన్ కట్ చేస్తే: ఓ భూ బకాసురునికి పెత్తనం, అవినీతిపరునికి తిరిగి అందలం ఎక్కిస్తే దొంగకే దొంగతనం కేసు అప్పగించిన చందంగా మారింది. దీంతో ఆలయ అభివృద్ధి తిరుగమనంలో వెళుతుందా లేక పురోగమనములో వెళుతుందా? ఎటు వెళుతుందని భక్తులు ఆందోళన,అలజడికి గురవుతున్నారు.
అధికారులు స్థిరత్వం లేకపోవడంతో పాలన పడకేసింది. :ఇక్కడ పనిచేస్తున్న నలుగురు సిబ్బందిని కమిషనర్ డిప్యూటేషన్ పై పంపారు. అయితే డిప్యూటేషన్కు పంపిన ప్రదేశాల్లో వారికి విధులు కేటాయించలేదు. దీంతో ఆ నలుగురు ఆకాశ దీపాల్లా గాలిలో వేలాడుతున్నారు. ఈ ఏడాది కని విని ఎరుగని రీతిలో ఈవో బ్రహ్మోత్సవాలు జరిపారు. సరి కదా మంత్రి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి భక్తిప్రపత్తులు చాటుకున్నారు. అయితే దేవస్థానంలో కొందరు కార్యకర్తలు ఎప్పుడూ గబ్బిలాళ్ళా పట్టుకొని వేలాడుతుంటారు.
ఉరవకొండలో పడకేసిన పాలన : రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ పాలన పడకేసిందని భక్తులు ఆరోపిస్తున్నారు. ఉరవకొండ గవిమఠ సంస్థానానికి ఏసీ కరువయ్యారు. 770 మఠాలకు మూలమటం ఇది. ఏసీ చిట్టెమ్మ బదిలీ అనంతరం ఓ చిన్నస్థాయి అధికారిని ఏసీగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. పెన్నహోబిలం ఇన్చార్జిగా అనంతపురం ఏసీ వ్యవహరిస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న నలుగురు సిబ్బందిని డిప్యూటేషన్ పై పంపారు. దీంతో పాలన కుంటుబడుతోంది. తిరిగి గుంతకల్ గ్రూప్ టెంపుల్ అవినీతి అధికారికి బాధ్యతలు అప్పగిస్తే భూములు నిధులు కైంకర్యమే తప్ప అభివృద్ధి కనుమరుగవుతోందని భక్తులు భావిస్తున్నారు.
ఉరవకొండలో రూరల్ సర్కిల్ అధికారి లేరు తద్వారా జోరుగా దొంగతనాలు జరుగుతున్నాయి. విడపనకల్ మండలంలో తాసిల్దార్ లేకపోగా ఎంపీడీవో నియామకం లేదు. ఇది ఇలా ఉంటే కూడేరుకు తాసిల్దార్ నియామకం లేకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయి.
రాష్ట్ర ప్రభుత్వం
సుపరిపాలనపై దృష్టి సారించాలని భక్తులు ప్రజలు కోరుతున్నారు.
వైసీపీ ప్రభుత్వానికి భిన్నంగా మాచ్చలేని నిజాయితీపరులైన అధికారులను నియమించి ప్రాంతా అభివృద్ధిపై సర్వ చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


Comments
Post a Comment