పిపిపి విధానానికి వ్యతిరేకంగా విద్యార్థుల సంతకాల సమరం – వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం
పిపిపి విధానానికి వ్యతిరేకంగా విద్యార్థుల సంతకాల సమరం
వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే పిపిపి (PPP) విధానానికి వ్యతిరేకంగా విద్యార్థి లోకం ఒక్కటైంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి విద్యార్థుల మద్దతు లభిస్తోంది.
ఈ సందర్భంగా వైయస్ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి వేముల అమరనాథ్ రెడ్డి, శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు పురుషోత్తం రాయల్ గార్లు పలు కళాశాలలను సందర్శించి విద్యార్థులతో సంతకాలు చేయించి పిపిపి విధానానికి వ్యతిరేకంగా తమ మద్దతు తెలియజేశారు.
“కూటమి ప్రభుత్వం కుట్రలతో పేదలకు వైద్య విద్యను దూరం చేస్తూ, ప్రైవేట్ వారికి అప్పగించే ప్రయత్నం చేస్తోంది. ఇది ప్రజా వ్యతిరేక చర్య,” అని అమరనాథ్ రెడ్డి విమర్శించారు.
విద్యార్థులు తమ కుటుంబాలకు, సమాజానికి ఈ విషయాన్ని తెలియజేసి ప్రభుత్వం పిపిపి విధానం నుంచి వెనక్కి తగ్గే వరకు బలమైన విద్యార్థి ఉద్యమాలు కొనసాగించాలి అని ఆయన పిలుపునిచ్చారు.
అలాగే ఆయన హెచ్చరించారు — “పిపిపి విధానం రద్దు చేయకపోతే కూటమి ప్రభుత్వం ప్రజా ఉద్యమాల మధ్య కనుమరుగైపోతుంది.”
ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు నాగార్జున, చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment