పి.గన్నవరం నియోజకవర్గానికి చెందిన శ్రీమతి అడ్డాల లక్ష్మీ పద్మావతి గారికి గుండె సంబంధిత వ్యాధికి పేస్‌మేకర్ అమర్చే చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ. 86,050ల ఆర్థిక సహాయం మంజూరు చేయబడింది.
ఈ చెక్కును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు సోమవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో బాధితురాలికి అందజేశారు.
గుండె వ్యాధితో బాధపడుతున్న శ్రీమతి లక్ష్మీ పద్మావతి చికిత్స నిమిత్తం ఆర్థిక సాయం కోరుతూ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి కార్యాలయానికి అర్జీ సమర్పించగా, ఆయన సిఫార్సుతో ఈ సహాయం మంజూరైంది.
ఈ సందర్భంగా పిడుగు హరిప్రసాద్ గారు సీఎం సహాయ నిధి పథకం పేద ప్రజలకు మేలు చేకూరుస్తోందని పేర్కొన్నారు.
