- సింగరాయకొండ పోలీసుల తీరుపై న్యాయవాది కోటేశ్వరి ధ్వజం
- 'స్పందన' విచారణ పత్రాలు మాయం చేశారని ఆరోపణ
సింగరాయకొండ
పోలీస్ స్టేషన్‌కు వచ్చిన స్పందన అర్జీ విచారణ పత్రాలను మాయం చేయడమే కాకుండా, న్యాయం అడిగిన తనపైనే తప్పుడు కేసులు బనాయించారని న్యాయవాది కోమటిరెడ్డి కోటేశ్వరి @ స్వాతి ఆరోపించారు.
ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. మన్నం రంగారావు పాసుపుస్తకాలు తన వద్దే ఉన్నాయని అంగీకరిస్తూ రాసిచ్చిన పత్రాన్ని ఎస్ఐ ఫాతిమా మాయం చేశారని తెలిపారు. సాక్ష్యాలు పోగొట్టింది కాక, దాని గురించి అడిగితే హేళనగా మాట్లాడారన్నారు. పోలీసులు నిందితులకు సహకరించడం వల్లే ఎంఆర్ఓ ఉష భూవివాదంలో తమపై ఒత్తిడి తెచ్చారని, చివరకు తమపైనే (క్రైమ్ నం 186/2023) అక్రమ కేసులు పెట్టారని పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు.

Comments
Post a Comment