కడప నగరంలోని చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న శ్రీ చైతన్య k-7 విద్యాసంస్థలో సోమవారం ఉదయం జస్వంతి అనే 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది. పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విద్యార్థినిని ప్రైవేట్ హాస్పిటల్లో తిప్పి చివరి క్షణంలో రిమ్స్ హాస్పిటల్ కు తరలించి పోస్టుమార్టానికి తీసుకువెళ్లడం జరిగింది. ఇదంతా అమ్మాయి చనిపోయిన తర్వాత తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడం దుర్మార్గమని వారన్నారు. విద్యార్థిని మరణానికి చైతన్య విద్యాసంస్థలం యజమాన్యం కారణం. కావున జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అసలైన దోషులను పట్టుకొని వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని వారు డిమాండ్ చేశారు.![]() |
| ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి. |
