కేంద్ర ప్రభుత్వం గిరిజన గ్రామాల సంక్షేమం అభివృద్ధి కి ధర్తీ ఆభా జన జాగృతి గ్రామీణ ఉత్కర్ష అభియాన్ ద్వారా వేలకోట్లు మంజూరు చేశారని అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం రూపా నాయక్ తండా లో త్వరలో పర్యటించి క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తానని జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాట్రోత్ హుస్సేన్ నాయక్ తెలియజేసినట్లు బంజారా గిరిజన సమైక్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఎస్ కె మహేష్ నాయక్ తెలిపారు శనివారం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి నట్లు తెలిపారు
ఈ సందర్భంగా ఆయన స్థానిక పాత్రికేయులతో మాట్లాడుతూ అనంతపురం జిల్లా లో నీ గిరిజన గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు ముఖ్యంగా దర్తి అబ జన జాగృతి ఉత్కర్ష అభియాన్ పనులను శాఖల వారీగా పరిశీలించడం జరుగుతుందని అలాగే గిరిజన గురుకులాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా స్వయానా పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలిపారు

Comments
Post a Comment