ఢిల్లీ పేలుడు ఘటనలో కీలక పరిణామం... పోలీసుల అదుపులో కారు యజమాని!

Malapati
0

ఢిల్లీ


దిల్లీ కారు పేలుళ్ల కేసులో మాజీ యజమాని సహా ఇద్దరు అరెస్ట్

ఎర్రకోట సమీపంలో జరిగిన ఘటనలో 13 మంది మృతి, 24 మందికి గాయాలు


పేలుడుకు ఉపయోగించిన కారు హరియాణాకు చెందినదిగా గుర్తింపు

ఉగ్రవాద కుట్ర కోణంలో దర్యాప్తు చేస్తున్న భద్రతా ఏజెన్సీలు

రెడ్‌లైట్ వద్ద ఆగిన కారులో సంభవించినట్లు వెల్లడించిన పోలీసులు

ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

దేశ రాజధాని దిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన కారు బాంబు పేలుడు ఘటన దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. పేలుడుకు ఉపయోగించిన కారు రిజిస్ట్రేషన్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన అధికారులు, దాని యజమానితో పాటు, గతంలో కారు సొంతదారును కూడా అదుపులోకి తీసుకున్నారు. హర్యానాకు చెందిన నదీమ్‌ఖాన్‌ పేరిట కారు రిజిస్టర్ అయి ఉండగా, అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఆ కారును కొనుగోలు చేసిన మహ్మద్ సల్మాన్‌ను కూడా గురుగ్రామ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సోమవారం సాయంత్రం 6.52 గంటల సమయంలో ఎర్రకోట సమీపంలోని రెడ్‌లైట్ వద్ద ఆగి ఉన్న కారులో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా, 24 మంది గాయపడ్డారు. మరో 22 వాహనాలు ధ్వంసమయ్యాయి. మృతుల సంఖ్యను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధృవీకరించారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.


ఘటనా స్థలాన్ని పరిశీలించిన దిల్లీ పోలీస్ కమిషనర్, ప్రాథమిక సమాచారం ప్రకారం పేలుడు హుండాయ్ ఐ20 కారులో జరిగినట్లు తెలిపారు. అయితే, మారుతి స్విఫ్ట్ డిజైర్ కారులో పేలుడు జరిగిందని కొందరు ప్రత్యక్ష సాక్షులు చెప్పడంతో వాహనంపై స్పష్టత రావాల్సి ఉంది. పేలుడు జరిగిన సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారి శరీరాల్లో ఎలాంటి పెల్లెట్లు లభించకపోవడం బాంబు పేలుడులో అసాధారణమని అధికారులు పేర్కొన్నారు.

ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఇది ఉగ్రవాద కుట్ర అయి ఉండవచ్చని భద్రతా ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. ఇటీవల హర్యానాలో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు పట్టుబడటం, ఉగ్రవాదుల అరెస్టులు జరగడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న ఇద్దరినీ విచారించడం ద్వారా ఈ కుట్ర వెనుక ఎవరున్నారనేది తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!