ఢిల్లీలో పేలుడు ఘటనలో పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకుని ఘటన గురించి విచారిస్తున్నారు. ఢిల్లీ పోలీసులు మాట్లాడుతూ.. సాయంత్రం 6.52 గంటలకు బ్లాస్ట్ జరిగిందన్నారు. నెమ్మదిగా వచ్చిన కారు.. రెడ్లైట్ దగ్గర ఆగి ఆగగానే ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగిందని తెలిపారు. కారు వెనకాలే ఉన్న మరిన్ని కార్లకు మంటలు అంటుకుని పేలుడు తీవ్రత పెరిగిందన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.
