మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ముఖ్యమంత్రిని కలిశారు: మార్కాపురం జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు
అమరావతి: నవంబర్ 27, 2025: మార్కాపురం శాసనసభ్యులు (ఎమ్మెల్యే) శ్రీ కందుల నారాయణరెడ్డి ఈరోజు అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబునాయుడు ని మర్యాదపూర్వకంగా కలిశారు.
మార్కాపురంను నూతన జిల్లాగా ప్రకటించినందుకు గాను, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మార్కాపురం జిల్లా ప్రజల తరపున ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రికి పసుపు గులాబీ పూల బొకేను అందజేశారు.
అనంతరం, మార్కాపురం జిల్లాకు 'చంద్రన్న మార్కాపురం జిల్లా'
గా నామకరణం చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు సమాచారం. మార్కాపురం జిల్లా ఆకాంక్షను నెరవేర్చినందుకు ఈ పేరు సముచితంగా ఉంటుందని ఎమ్మెల్యే అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
