పేదరికం,సహజమా? కృత్రిమమా?
నేడు 76వ రాజ్యాంగ దినం
పేదలు చదువుకో కూడదు, వారికి ఆస్తులు,అధికారం ప్రజాస్వామ్యం ఉండకూడదు, ప్రభుత్వాలు,ప్రైవేట్,కార్పొరేట్ పెట్టుబడిదారీ వ్యవస్థలనే పెంచి పోషిస్తున్నప్పుడు పేదరికం కృత్రిమం కాక మరేమవుతుంది.
నేడున్న వ్యవస్థ ధనవంతుల చేత ధనవంతుల కొరకు ధనవంతులే ఉండాలంటుంది.
కేంద్రం,రాష్ట్రాలలో అధికారంలో ఉన్న
అధికార,ప్రతిపక్ష పార్టీలు అగ్ర వర్ణ,అగ్ర కుల,ధనిక ఆధిపత్య పార్టీలు కాబట్టే నిరంతరం అవి ధనవంతుల కోసమే పని చేస్తున్నాయి.
స్వాతంత్ర్యానంతరం ఏర్పడిన అన్ని ప్రభుత్వాలు భారత రాజ్యాంగం ప్రసాధించిన ప్రజాస్వామ్యం,స్వేచ్ఛ,సమానత్వం,సౌభ్రాతృత్వం,లౌకికత త్వాలను మూలన పడేయడం వలన విద్య,ఉద్యోగ రిజర్వేషన్లు అమలు కాలేదని గత 78 సంవత్సరాల చరిత్ర చెబుతోంది.
మనదేశంలో వేల సంవత్సరాల నుండి ఆధిపత్య దోపిడీనే అమలులో ఉంది.దాని పునాదులు
వర్ణ వ్యవస్థ,మనుస్మృతి,కుల వ్యవస్థ,కాబట్టే పాలక కులాల జెండాలు ఎన్ని ఉన్నా
వారి అజెండాలు దోపిడీనే.
ఈ ఆధిపత్య సమాజంలో బహుజనులు
మనిషులుగా గుర్తింపబడరు. అధికారంలో,దేశ సంపదలో వాటా ఉండదు.జనాభా లెక్కలలోఉండరు.విద్యను, వైద్యాన్ని అందించరు.
వీరు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వరు.
వీరికి బాధ్యతలు తప్ప హక్కులు ఉండవు.
వీరు కూడు,గూడు,గుడ్డ లేకుండా శాశ్వత బానిసలుగా ఉంటారు.వీరికి నిరంతరం మూఢత్వాన్ని నూరిపోస్తూ
మానవ రూపంలో ఉన్న పశువులుగా చూస్తారు. అందుకే దేశంలో బహుజనులు వేల సంవత్సరాలైన బానిసలుగానేఉండిపోయారు.
బహుజనులను విముక్తి చేయడానికి,బుద్ధుడు,కబీర్, సాహు,పెరియార్, ఫూలే, అంబేడ్కర్,కాన్షీరాం మహానీయుల మార్గంలో పోరాటం చేయాలి.
మతవాద,కులవాద,తీవ్రవాద ఉగ్రవాద,ప్రాంతీయ వాద సృష్టి కర్తలు అగ్రవర్ణదురహంకారులే. దేశంలో అన్ని ఇజాలను సృష్టించి ప్రచారం చేస్తునదీ వీరే,అంటే భారత దేశ అన్ని సమస్యలకు మూలకారణం వీరేనని చరిత్ర చెబుతోంది.
కులవాదులను,మత వాదులను,మావోయిస్టులను కమ్యూనిస్టులను,పెట్టుబడిదారులను,ప్రాంతీయ వాదులను తయారు చేసేది వీరే.
విద్యను ప్రైవేటీకరణ చేసి పేదలను విద్య లేని వింత పశువులను చేసి,ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి బహుజన సమాజానికి ఉద్యోగాలు లేకుండా చేసేది వీరే.
పని చేసే రైతులకు గిట్టుబాటు ధర లేకుండా చేసి, వారికి కూడు, గూడు, గుడ్డ, గౌరవం లేకుండా చేసేది వీరే.దేశంలో వీరి శాతం కేవలం 3 శాతం మాత్రమే.97 శాతంగా ఉన్న బహుజనులను మానసిక బానిసలుగా చేసేశారు.
ఈ సమస్యలకు పరిష్కారాన్ని చూపే ఫూలే, అంబేడ్కర్ వాదులను ఈ సమాజం తయారు చేయక పోగా వీరి వాదముల పై దాడి చేస్తున్నారు.
భూమి పుత్రులైన బహుజనులు పూలే, అంబేద్కర్ వాదములతో ఈ దేశానికి పాలకులు,దేశ సంపదకు యజమానులు అవుతారని కుట్రపూరిత మైన కుట్రలే పైన చెప్పబడిన అనేక వాదాల అవతారాలు.
కాబట్టి బహుజనులు పైన చెప్పిన బహుజన మేధావుల మార్గంలో పోరాటం చేయాలి.అప్పుడే బహుజనులకు రాజ్యాధికారం సిద్ధిస్తుంది.పేదరికం నశించి సమానత్వం,ఏర్పడి అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని రమణ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి వేదికరాష్ట్ర ఉపాధ్యష్యులు కేవిరమణ పేర్కొన్నారు.

Comments
Post a Comment