త్రిమూర్తుల మధ్యలో నలిగిపోతున్న క్యాడర్ – అధిష్టానం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో అంతర్గత పోరు తీవ్రస్థాయికి చేరింది. ఒకరికి మద్దతు ఇస్తే మరొకరికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడడంతో కార్యకర్తలు తికమకపాటుకు గురవుతున్నారు.
ఎవరికి చివరికి టికెట్ దక్కుతుందో స్పష్టత లేక పార్టీ క్యాడర్ తీవ్ర ఆందోళనలో ఉన్నారు. త్రిమూర్తుల మధ్య కొనసాగుతున్న ఈ రాజకీయ యుద్ధం పార్టీ బలాన్ని దెబ్బతీసేలా మారిందని స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
గతంలో మాజీ మంత్రి ఉషా గారికి మద్దతుగా పనిచేసిన కొందరు నాయకులు, ప్రస్తుతం నియోజకవర్గ ఇంచార్జ్ నుంచి దూరమవుతున్నట్టుగా సమాచారం.
ఎవరికి నచ్చినట్టుగా వ్యవహారాలు సాగిపోవడం వల్ల వైసీపీ శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొంది.
ఈ నేపథ్యంలో త్రిమూర్తులలో ఎవరికి అదృష్టం వరిస్తుందో, ఎవరికి అధిష్టానం మోక్షం కలిగిస్తుందో వేచి చూడాల్సిందేనని పార్టీ కార్యకర్తలు అంటున్నారు.
Comments
Post a Comment