![]() |
| ఎస్కేయూ, జేఎన్టీయూ, సెంట్రల్ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలి. |
ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా భవనాలు ఏర్పాటు చేయాలి.
వజ్రకరూర్ లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలి.
డిగ్రీలో తీసుకొచ్చిన హానర్స్ డిగ్రీ ,మేజర్ - మైనర్ సబ్జెక్ట్ విధానాన్ని రద్దు చేయాలి.
పెండింగ్ లో ఉన్న 6,800 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి.
నవంబర్ 3 తేదీ నుండి 7 తేదీ వరకు అనంతపురం జిల్లా విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జీపు యాత్ర ప్రారంభించడమైనది దీనికి సంబంధించినటువంటి కరపత్రాలు ఎస్ఎఫ్ఐ అనంతపురం జిల్లా సహాయ కార్యదర్శి S.M.హరూన్ రషీద్ విడుదల చేశారు వారు మాట్లాడుతూ..... ఈ జీపు యాత్రకు విద్యార్థులు, యువత, మేధావులు కలిసి జయప్రదం చేయాలని అలాగే SK యూనివర్సిటీ,JNTU , సెంట్రల్ యూనివర్సిటీ లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలి అలాగే ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూరు మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు కావున వజ్రకరూరు మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలి అలాగే ఉరవకొండ లో ఉన్నటువంటి బాలికల జూనియర్ కళాశాలకు విద్యార్థులకు అనుగుణంగా కళాశాల భవనాలు ఏర్పాటు చేయాలి, మరియు పెండింగ్లో ఉన్నటువంటి 6800 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే ఈ ప్రభుత్వం విడుదల చేయాలి, మరియు ఇంటర్ విద్య తీవ్రంగా దిగజారింది అనడానికి నిదర్శనం మొన్న ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రంలోనే మన జిల్లా వెనుకబడి ఉంది సగానికి పైగా విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేకపోయారు, శాశ్విత ప్రాతిపదికన అధ్యాపకులు లేక పాఠ్యపుస్తకాలు ఇవ్వకుండా మౌలిక సదుపాయాల ఏమిటో , ల్యాబులు, లైబ్రరీలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కొన్ని కళాశాలలో పర్మినెంట్ పోస్టులు కేవలం ప్రిన్సిపల్ లకే పరిమితం అయిందంటే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఎంత నిర్లక్ష్యం చేపడుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాత పద్ధతిలోనే కళాశాల సమయం కొనసాగించాలి, ఇక కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజులకు అడ్డు అదుపు లేదు, వివిధ కోర్సులు పెట్టి తల్లిదండ్రులను మోసం చేసి లక్షల్లో ఫీజు దోచుకుంటున్నారు, ప్రభుత్వం నిబంధనలు ఏమాత్రం పాటించడం లేదు, ప్రభుత్వం జిల్లాలో ప్రకటించిన ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ప్రకటనకే పరిమితమైనాయి. దీనిపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి లేనిచో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా హెచ్చరించడం అయినది ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ అనంతపురం జిల్లా సహాయ కార్యదర్శి S.M.హరూన్ రషీద్, ఉరవకొండ మండల అధ్యక్షుడు రాజేష్ ఎస్ఎఫ్ఐ నాయకులు అభిషేక్ , పవన్, అరవింద్, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment