బస్సులో పసికందు వాంతి… బాలింతతోనే శుభ్రపరిచించిన సిబ్బంది!

Malapati
0


అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం డిపో:

కళ్యాణదుర్గం డిపో ఆర్టీసీ బస్సులో మానవత్వాన్ని మరిచిపోయే ఘటన చోటుచేసుకుంది. మూడు నెలల పసికందు తల్లిపాలు కక్కడంతో బస్సులో స్వల్ప మురికి పడింది. అయితే, బస్సు సిబ్బంది సున్నితంగా స్పందించకుండా, ఆ బాలింత చేతనే ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయమని ఒత్తిడి చేసినట్లు ప్రయాణికులు వెల్లడించారు.

సాక్ష్యుల ప్రకారం, శిశువు వాంతి చేసిన ప్రదేశాన్ని తల్లి స్వయంగా నీళ్లు పోసి శుభ్రం చేయాల్సి వచ్చింది. ఈ దృశ్యం చూసిన ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా రవాణా వంటి సేవా రంగాల్లో ఇలాంటి అమానవీయ వైఖరి అంగీకారయోగ్యం కాదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

స్థానికులు ఈ ఘటనపై డిపో మేనేజర్ తక్షణ విచారణ జరిపి, సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!