కనేకల్లుమండలం మీనా హళ్లి గ్రామంలో శనివారం పండుగ వాతావరణం నెలకొంది.
మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో ముస్తాబై, జాజిపూలు, కొబ్బరికాయలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. డప్పుల మోగింపు, సాంస్కృతిక వాతావరణంతో గ్రామాలు జాతరను తలపించాయి, సందడిగా మారాయి.
పురుషులు, యువతులు, బాలబాలికలు పెద్ద సంఖ్యలో హారతులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
శాంతి, సౌభాగ్యం కోసం ప్రార్థన:
గజ గౌరీ అమ్మవారి పూజలతో గ్రామంలో శాంతి, సౌభాగ్యం కలగాలని భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. పూజల అనంతరం మహిళలు పరస్పరం తాంబూలాలు పంచుకున్నారు. ఈ వేడుకతో గ్రామమంతా పండుగ శోభతో కళకళలాడింది. గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి రోడ్డు వరకు విద్యుత్ దీపాలు ఆకర్షించాయి. సుంకులమ్మ దేవాలయం నుంచి ఎస్సీ కాలనీ వరకు విద్యుత్ దీపాలు ఆకర్షించాయి. ఈ వేడుకల్లో మర్రి స్వామి, బిజెపి బాలరాజు, బి,టి వెంకటేశులు,డి యువరాజు, డి వన్నూరు స్వామి, ఎర్రప్ప,కురుబ వన్నూరు స్వామి, శేఖర, డి బసప్ప, బోయ వండ్రప్ప, మాజీ వాలంటీర్ బద్రి, జెసిబి నాగరాజు, కన్నయ్య, యువత పాల్గొని హారతులు కార్యక్రమం విజయవంతం చేశారు.
