*
అమరావతి :
నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం.. తుపానుగా మారిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ తుపానుకు ‘దిత్వాహ్’గా యెమన్ దేశం నామకరణం చేసినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈనెల 30న ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశముందని రెడ్ అలర్ట్ ప్రకటించారు.
