బోడ.. కిలో రూ.2వేలు....

Malapati
0

 



ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతం సహజంగా దొరికే ట్రైబల్‌ ఆహారానికి పెట్టింది పేరు.ఇక్కడ దొరికే అనేక సహజసిద్ధ పదార్థాల్లో బోడ కూడా ఒకటి. దీని ధర కిలో రెండువేల వరకూ ఉంటుంది. రుచిలోనే కాదు ఆకృతిలోనూ వైవిధ్యంగా ఉండే ఆహారం ఇది..!

బోడ దీనినే తెలుగులో బోడసొత్తు అంటారు. ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో చాలా అరుదుగా దొరుకే ఆహారం. ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతంలో విరివిగా దొరికే ఈ బోడ.. ఏడాదంతా దొరకదు. వర్షం పడే ముందు ఒకరకం ఉక్క వాతావరణంలో అచ్చంగా పుట్టగొడుగులు మొలిచినట్టుగా మొలుస్తాయి. పుట్టగొడుగులు ఈ చెట్లపైనన్నా మొలుస్తాయి కానీ ఈ బోడ అలా కాదు సాల చెట్లకింద వాటి వేర్లపై పైనుంచి మొలుస్తాయి. మొదట పడే వర్షానికి ఒకరకం బోడ.. తర్వాత కురిసే వర్షాలకి మరికాస్త భిన్నమైన బోడ పుడతాయి. రుచిలో కొద్దిగా తేడా ఉంటుంది. రెండూ కిలో రెండు వేల రూపాయల పైమాటే. ఇవి సొంతంగా పండించడానికి వీలుకాదు. దొరికినప్పుడే సేకరించాలి కాబట్టి అంత రేటు. చూడ్డానికి చిన్నచిన్న గులకరాళ్లలా, బేబీ ఆలూలా ఉంటాయివి. రుచి అమోఘం. సెనగపప్పు, నాటుకోడి మాంసం, బంగాళాదుంప ఇలా భిన్నమైన కాంబినేషన్లతో వండుతారు. ఇందులో పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. బోడ అంటే గోండు భాషలో ఫంగస్‌ అని అర్థం. ఇది సహజమైన ఔషధం కూడా. పుష్కలంగా దొరికిన రోజుల్లో వీటిని ఎండబెడతారు. తర్వాత చూర్ణం చేసి ఆవనూనెతో కలిపి చర్మవ్యాధులకు మందుగా వాడతారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!