ఉరవకొండ జనవరి 21:
ఎస్సీ జన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉరవకొండ మండల పరిధిలోని రాయంపల్లి గ్రామానికి చెందిన గుడిసెల రాజేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఆ సంఘం రాష్ట్ర ఇంచార్జ్ మాల్యా వంతం రాంప్రసాద్ ఆధ్వర్యంలో నూతన కమిటీలు ఏర్పాటు చేశారు.ముఖ్య అతిథిగా ఎస్సీ జన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ దాసగాని కుల్లయ్యప్ప పాల్గొని నూతనంగా ఎన్నికైన నాయకులకు ఎస్సీల సమస్యల కోసం పనిచేయాలని దిశ నిర్దేశించారు.అలాగే జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన గుడిసెల రాజేష్ మాట్లాడుతూ
గతంలో ఉరవకొండ నియోజకవర్గం ఇన్చార్జిగా పనిచేసి నియోజక వర్గంలో ఎస్సీలు ఎదుర్కొన్న ఎన్నో సమస్యలో పాల్గొని పోరాటాలు పరిష్కారం దిశగా కృషి చేసినట్లు తెలిపారు.నాపై నమ్మకం ఉంచి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నిక చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
