శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి గోడ పత్రికల ఆవిష్కరణ

Malapati
0

 

ఉరవకొండ 


జనవరి 17:మండల కేంద్రంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయ ప్రాంగణంలో రథసప్తమి వేడుకలకు సంబంధించిన గోడ పత్రికలను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా విడుదల చేశారు.

వచ్చే రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు సమాచారం అందించేందుకు, ఉత్సవ వివరాలతో కూడిన ఈ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ, రథసప్తమి రోజున స్వామివారికి నిర్వహించే ప్రత్యేక పూజలు, రథోత్సవం మరియు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.


ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చిరంజీవి మహేంద్ర గౌడ్, కృష్ణ మోహన్, సుధాకర్, నాగభూషణం స్వామి, వీరేష్ స్వామి, మాజీ ఎంపీటీసీ రామస్వామి, భీమన్న, శివశంకర్, నాగరాజ్, చక్రి, సీనా మరియు ఇతర ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!