-వసతి గృహాల్లో మలాథియాన్ దోమల మందు పిచికారి
అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ భ్రమరాంబ దేవి, జిల్లా మలేరియా అధికారి ఓబులు ఆదేశాల మేరకు వజ్రకరూరు మండల కేంద్రంలో పలు వసతి గృహాలు, గురుకుల పాఠశాలలలో శనివారం మలాథియాన్ 25 శాతం దోమల మందు పిచికారి కార్యక్రమం ఎంపిహెచ్ఈఓ గురు ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... దోమల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సంక్రాంతి పండుగ సెలవులు సందర్భంగా సాంఘిక సంక్షేమ బాలుర, బాలికల వసతి గృహం, ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం, మహాత్మా జ్యోతి భా పూలే బీసీ గురుకుల వసతి గృహాల్లో పరిశుభ్రతను పరిశీలించి, దోమల నివారణకు మలాథియాన్ 25శాతం స్ప్రే చేయించడం జరిగిందన్నారు. మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దోమలు దరిచేరకుండా చూసుకోవాలన్నారు ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించాలని వసతి గృహ సంక్షేమ అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నాగ శంకర్, హెల్త్ అసిస్టెంట్లు సంపత్ కుమార్, నాగరాజు, భారత సేవా రత్న జాతీయ అవార్డు గ్రహీత, ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం ట్యూటర్ ఎంపీ మల్లికార్జున, వాచ్ మెన్ క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
