కూటమి ప్రభుత్వంలో *పంచాయతీరాజ్ శాఖ దివాలా?*

Malapati
0


 

హైకోర్టు సంచలన ప్రకటన!కేవి రమణ

 ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్య వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖ దివాలా తీసిందని

హైకోర్టు సంచలన ప్రకటన చేసింది.

     2024 జూన్ నుండి తమకు రావాల్సిన గౌరవ వేతనాలు చెల్లించడం లేదంటూ వైఎస్సార్ కడప జిల్లా జడ్పిటిసి,ఎంపీటీసీలు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.దీనిపై పిటిషనర్ల తరఫున ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు.ఆ సందర్బంగా హైకోర్టు ఎందుకు చెల్లించలేదో ప్రమాణ పత్రం రూపంలో తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

    హైకోర్టు ఆదేశాలతో పంచాయతీరాజ్ శాఖ సీఈవో మెమో దాఖలు చేస్తూ బడ్జెట్ లేని కారణంగా జడ్పిటిసి, ఎంపీటీసీలకు గౌరవ వేతనం ఇవ్వలేకపోయామని,కొంచెం సమయం ఇస్తే గౌరవ వేతనాలు చెల్లిస్తామన్నారు.

దీనిపై స్పందించిన హైకోర్టు ధర్మాసనం,పూర్తి సమాచారంతో ప్రమాణ పత్రం దాఖలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.

     ఒకవైపు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తూ,మరోవైపు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి విగ్రహాల ఏర్పాటు,ఇంకోవైపు తండ్రీ,కొడుకులు వేల కోట్లు ఖర్చుపెట్టి విదేశ పర్యటనలు,మరోవైపు ఎమ్మెల్యే,ఎమ్మెల్సీలకు టెన్షన్ గా జీతాల చెల్లింపులు చేస్తూ, కేవలం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల జీతాలు మాత్రమే చెల్లించక పోవడం *స్థానికసంస్థలను,*వెనుకబడిన ప్రాంతాలను* నిర్లక్ష్యం చేయడం కాదా?అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

     రాష్ట్రవ్యాప్తంగా,మెజారిటీ ప్రజా ప్రతినిధులు వైసిపి వారు ఉండడం స్థానిక సంస్థలు చేసుకున్న పాపమా? అలా ఉండడానికి వీలులేదని ప్రజాస్వామికంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమందిని తన డబ్బుతో కొనేసి మండల, మున్సిపాలిటీ,కార్పొరేషన్లకు అధ్యక్షులుగా దొడ్డిదారిలో తమ వారిని కూర్చోబెట్టు ఉన్నారు కదా,ఎందుకు వేతనాలు చెల్లించడం లేదు?, గంప గుత్తగా వైసిపి ప్రజా ప్రతినిధులందరూ తెలుగుదేశంలో చేరిపోతే తప్ప వేతనాలు చెల్లించరేమోనని చర్చించుకుంటున్నారు.

    వేతనాలు చెల్లించకపోతే *అభివృద్ధి కేంద్రీకరణ* తో *ఆశ్రిత పక్షపాతం* తో ఈ ప్రభుత్వం చేస్తున్న *దుబారా ఖర్చులను* ప్రజలో ప్రచారం చేసి,రాష్ట్రవ్యాప్తంగా మద్దతు కూడగట్టి,ప్రజా పోరాటానికి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సిద్ధపడాలని అందులకు *వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక* అండగా ఉంటుందని పిలుపునిస్తోంది.

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!