రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఉరవకొండ పట్టణంలోని టవర్‌క్లాక్ ప్రాంతంలో ఆటో డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గుంతకల్లు ఎంవీఐ రాజ బాబు మరియు ఉరవకొండ యు.పి.ఎస్ సి.ఐ మహానంది ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో అధికారులు ఆటో డ్రైవర్లకు పలు కీలక సూచనలు చేశారు:
ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలను తు.చ తప్పకుండా పాటించాలని, అప్పుడే రోడ్డు ప్రమాదాలను నివారించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రతతో పాటు డ్రైవర్ల రక్షణ కోసం హెల్మెట్ మరియు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా వాడాలని సూచించారు పరిమితికి మించిన వేగంతో వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని, రోడ్డుపై క్రమశిక్షణతో వాహనాలను నడపాలని అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఉరవకొండ పట్టణంలోని ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ప్రమాద రహిత సమాజం కోసం పోలీస్ మరియు రవాణా శాఖలు తీసుకుంటున్న ఈ చర్యలకు డ్రైవర్లు పూర్తి సహకారం అందించారు.
