-
భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బొమ్మనహల్ మండలంలో నేడు నూతన ఎంపీపీ ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు,ఎన్నికలు ప్రశాంతంగా,పారదర్శకంగా జరిగేందుకు విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు పేర్కొన్నారు,
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, డీఎస్పీ పర్యవేక్షణలో 6 మంది సీఐలు,10 మంది ఎస్‌ఐలు,60 మంది పోలీస్ సిబ్బంది,20 మంది స్పెషల్ పార్టీ పోలీసులు,10 మంది మహిళా పోలీసులు ఎన్నికల బందోబస్తు విధుల్లో పాల్గొననున్నట్లు డీఎస్పీ రవిబాబు తెలిపారు,ఈ ఎన్నికల సందర్భంగా డీఎస్పీ రవిబాబు మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలు చేస్తామని, ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులు సూచించారు.
