అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం డి.కొండాపురం గ్రామంలో ఈ రోజు బుధవారం బెస్త సేవా సంఘం గ్రామ శాఖను ఏర్పాటు చేయడం జరిగిందని కేవి రమణ తెలిపారు.
ఈ సందర్భంగా బెస్త సేవా సంఘం జిల్లా అధ్యక్షులు కె.వి. రమణ మాట్లాడుతూ,బెస్త జాతి సంరక్షణ కోసం సంఘం చాలా అవసరమని,సంఘం వల్లనే ఐకమత్యం పెరిగి తమ అవసరాలను తీర్చుకోవడం జరుగుతుందని, కొండాపురం గ్రామం లో బెస్తలు స్మశాన సమస్య ఎదుర్కొంటున్నారని సంబంధిత అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి కొనుకోవాలని మరియు తమ కులదైవ మైన గంగమ్మ దేవాలయాన్ని నిర్మించుకోవడానికి ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే గారు సహకరించాలని కోరడమైనది. అంతేకాకుండా బెస్తలు రాజకీయంగా ఎదగాలని, అన్ని సమస్యలకు పరిష్కారం రాజకీయ వ్యవస్థ ఒక్కటేనని ఆ రాజకీయ వ్యవస్థలో బెస్తలు బలంగా లేకపోవడమే మన బలహీనత అని ఆ బలహీనతను అధిగమించి, రాజకీయంగా ఎదగాలని అందుకు జిల్లా బెస్త సేవా సంఘం అన్ని విధాలుగా సహకారిస్తుందని తెలియజేశారు. అనంతరం గ్రామ శాఖ అధ్యక్షులుగా బెస్త మహేష్,
ఉపాధ్యక్షులు శివ,ప్రభాకర్,
గౌరవ అధ్యక్షులు డి.నాగేంద్ర, కార్యదర్శిగా,సురేష్, సహాయ కార్యదర్శి యు.సురేష్, ట్రెజరర్ జి రాఘవేంద్ర. 20మంది కమిటీ సభ్యులు.
ఈ కార్యక్రమంలో బెస్త సేవా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గంగప్ప శింగనమల బెస్త సేవా సంఘం కార్యదర్శి నారాయణస్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్ హరినాథ్, జిల్లా నాయకులు శంకర్,పూలచెర్ల నరేష్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం సామూహిక భోజన కార్యక్రమం జరిగింది.
