ఉరవకొండ
C.P.S ఉద్యోగ ఉపాధ్యాయుల D.A అరియర్స్ జమలో వ్యత్యాసాలను తొలగించాలి: A.P.T.F-257
ఉరవకొండ: A.P.T.F ప్రాంతీయ కార్యాలయంలో A.P.T.F విడపనకల్ మండల శాఖ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇటీవల A.P.T.F విడపనకల్ మండల శాఖ అధ్యక్ష పదవి రాజీనామాతో ఖాళీ ఏర్పడినందువల్ల, నూతన అధ్యక్షునిగా "సాంకే మునిస్వామి" ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి B.C. ఓబన్న, రాష్ట్ర కౌన్సిలర్ M. శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇటీవల ఉద్యోగ, ఉపాధ్యాయులకు D.A అరియర్స్ విడుదల చేసిందని, కానీ సాంకేతిక కారణాల వల్ల చాలా మందికి అవి జమ కాలేదని పేర్కొన్నారు. ఆర్థిక శాఖ అధికారులు స్పందించి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
అలాగే మరికొన్ని కీలక డిమాండ్లు చేశారు:
12వ P.R.C వెంటనే ప్రకటించి అమలు చేయాలి.
విద్యాశాఖలో 'బుక్ లెట్' విధానానికి స్వస్తి పలకాలి.
2022 నుండి పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్ బిల్లులను మంజూరు చేయాలి.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రత్యేక ఆహ్వానితులు బండారు నారాయణస్వామి, ఉరవకొండ మండల శాఖ గౌరవాధ్యక్షులు R. లోకేష్, ప్రధాన కార్యదర్శి Y. భువనేశ్వరి చౌదరి, వజ్రకరూరు ప్రధాన కార్యదర్శి S. ధనుంజయ, జిల్లా కౌన్సిలర్లు B. గంగయ్య, A. కృష్ణ, A. రాజేష్, భూమా రామాంజనేయులు, నాగేష్, D. వన్నూరు స్వామి, వీరేష్, M. భాస్కర్, వెంకటస్వామి, M. సోమశేఖర్, N. రవి, B. మల్లేష్, ఆవుల నాగిరెడ్డి తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు
