12oవ మహాభారత యజ్ఞ మహోత్సవం ధ్వజారోహణ
September 21, 2025
0
తవణంపల్లి:- తవణంపల్లి మండల కేంద్రంలో ద్రౌపతి ధర్మరాజుల ఆలయంలో 120వ మహాభారత మహోత్సవ ధ్వజారోహణ అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా గుడిసె మునస్వామి శెట్టి మాట్లాడుతూ 21 ఆదివారం ఉదయం 10 గంటలకు ముఖ నక్షత్రం యోగంతో కూడిన శుభ వృశ్చిక లగ్నమందు తవణంపల్లి కేంద్రంలోని శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజుల ఆలయంలో మహాభారత యజ్ఞం ధ్వజారోహణ జరిగింది ఈ సందర్భంగా గుడిసె మునస్వామి మాట్లాడుతూ 21వ తేదీ నుండి 13 10 2025 వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు మహాభారత హరికథ గాన కోకిల నాట్య మయూరి టిటిడి అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆర్టిస్ట్ హరికథ కాలక్షేపం జరుగుతుందని ఆలయ ధర్మకర్త తెలిపారు ఈ సందర్భంగా ప్రతిరోజు 2 గంటల నుండి6 గంటల వరకు ఏ. శారద భాగవతలని గారిచే హరికథ కాలక్షేపం29 వ తేదీ నుండి 13 10 2025 వరకు ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం 5. 30 గంటల వరకు మహాభారత హరికథ కాలక్షేపం జరుగుతుందని 29 వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు బక్కసుర బలి బండి అదే రోజు నుండి 12. 10. 20వ తేదీ వరకు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు 14 రోజులు ప్రతిరోజు రాత్రి వీధి నాటకంలో తమిళంలో అతి వైభవంగా జరుగును నాటక కళాధారులు ఓం శ్రీ వరసిద్ద వినాయక నాట మండలి వారిచే మేనేజర్స్ టీ.రంగన్ ,ఆనందం .ఏమని డి. అరవింద్ సాయి వినీత్ వీరిచే వీధి నాటకం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు ఆలయ ధర్మకర్త గుడిసె మునస్వామి సదాశివ శెట్టి మోహన్ వేలు మాజీ ఆలయ ధర్మకర్త గణేష్ యువజన సంఘ సభ్యులు చుట్టుపక్కల గ్రామస్తులు అధికసంఖ్యలోపాల్గొన్నారు
