పీ పీ పీ ముసుగులో 17వైద్య కళాశాల ల ప్రైవేటిక
పీపిపి ముసుగులో17 మెడికల్ కళాశాలను ప్రైవేటికరణ ఆపాలని ఉరవకొండ మండల కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మార్వోకు వినతి పత్రం ఇచ్చారు.. ఏ ఐ యఫ్ ఢీ యస్ జిల్లా నాయకుడు తరుణ్, మండల కార్యదర్శి మధు మాట్లాడు తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 మెడికల్ కళాశాలలో పి పి పి పేరుతో ప్రైవేటీకరణను ఈ రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17 మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య - ఖండిస్తున్నాం. రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటుకు జాతీయ వైద్య మండలి అనుమతితో నిధులు సమకూర్చింది.ఈ కళాశాలను ఏర్పాటు చేసేటప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల కు దూరం చేసే విధంగా పీపీపీ తీసుకువచ్చారు. పి పి పి పేరుతో ప్రైవేటీకరణ చేయడం ద్వారా ప్రవేట్, కార్పోరేట్ సంస్థలు ఐదు సంవత్సరాలు ఎంబీబీఎస్ కోర్సు దాదాపు 30 నుంచి 50 లక్షలు చేస్తారు.పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు అంత మొత్తం చెల్లించి చదవలేని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వమే మెడికల్ కళాశాలను నడపాలని దాని ద్వారా పేద విద్యార్థులకు వైద్య విద్య అతి తక్కువ ఖర్చుతో అందుతుంది. దీనిని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని తెలిపారు.. ప్రభుత్వం వైద్య విద్యార్థులకు అండగా నిలుస్తుందని లోకేష్ బాబు తన యువగలం పాదయాత్రలో వైద్య విద్యార్థులందరికీ సమాన విద్యను అందిస్తామని ఉచిత విద్యను అందిస్తామని ప్రతి విద్యార్థికి న్యాయం చేస్తామని చెప్పి అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం తీసుకొచ్చిన 17 వైద్య కళాశాలలకు సంబంధించి 1800. మెడికల్ సీట్లు రద్దు చేయమని కూటమి ప్రభుత్వం జాతీయ మెడికల్ కౌన్సిల్ లకు లేఖ రాయడం. చాలా దుర్మార్గం. 80 శాతం నిర్మాణం పూర్తి చేసుకొని ఎంబీబీఎస్ తరగతులు నిర్వహించుటకు సిద్ధంగా ఉ న్నాయి. ఆ కళాశాలలను 66 సంవత్సరాలు లీజుకు ఇచ్చే విధంగా %%4 విధానాన్ని తీసుకువచ్చి వైద్య విద్యను కూటమి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు పూర్తిగా దూరం చేయడమే అవుతుంది 911 90000 రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి వెంటనే పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి. కార్పొరేట్ శక్తులకు అప్పగించే విధానాన్ని రద్దు చేసి 17 వైద్య కళాశాలలను ప్రభుత్వమే మెడికల్ కళాశాలలను నడపాలి అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్యగా - ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని వైద్య విద్యాశాఖమంత్రులను కోరుతున్నాం.

Comments
Post a Comment